L2: ఎంపురాన్ ట్రైలర్‌: దైవ పుత్రుడే అన్యాయం చేస్తుంటే సైతాన్ ఆడే ఆట‌!

తాజాగా రిలీజైన ట్రైల‌ర్ చెబుతోంది. ట్రైల‌ర్ నాలుగు నిమిషాల నిడివితో ఆద్యంతం ర‌క్తి కట్టించింది.;

Update: 2025-03-20 04:36 GMT

"దైవ పుత్రుడే అన్యాయం చేస్తున్న‌ప్పుడు సైతాన్ ని కాకుండా ఎవ‌రిని సాయం అడ‌గ‌గలం! " ఈ ఒక్క లైన్ తో థ్రిల్ల‌ర్ స్టోరి ర‌క్తి క‌ట్టిస్తోంది. ఈ లైన్‌లో ఎవ‌రి ఊహ‌కు అంద‌ని చాలా అర్థం దాగి ఉంది. మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ న‌టించిన లూసీఫ‌ర్ సీక్వెల్ వ‌స్తోంది అంటే ఆమాత్రం బిల్డ‌ప్ ఉండాలి. లూసీఫ‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించాక నాలుగేళ్లుగా ఈ సినిమాకి సీక్వెల్ తెర‌కెక్కించేందుకు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ చాలా చెమ‌టోడ్చారు. అత‌డు ఈ చిత్రంలో ఒక కీల‌క పాత్ర‌ను పోషించ‌డ‌మే గాక‌, ద‌ర్శ‌కుడిగా 24 శాఖ‌ల్ని స‌మన్వ‌యం చేస్తూ చాలా హార్డ్ వ‌ర్క్ చేసార‌ని తాజాగా రిలీజైన ట్రైల‌ర్ చెబుతోంది. ట్రైల‌ర్ నాలుగు నిమిషాల నిడివితో ఆద్యంతం ర‌క్తి కట్టించింది. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ ట్రైలర్‌ను విడుద‌ల చేయ‌గా, మలయాళ ట్రైలర్ ఇంకా విడుదల కాలేదు.


ఎంపురాన్ 2కి మోహన్ లాల్ -పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సన్నివేశాలు యూనిక్ నెస్ తో ర‌క్తి క‌ట్టించాయి. ట్రైల‌ర్ ఆద్యంతం అధికారం, దురాశ, ద్రోహం, ప్రతీకారంతో ఆధిపత్యం చెలాయించే ఎంపురాన్ ప్రపంచాన్ని మనకు ప‌రిచ‌యం చేస్తుంది. మోహన్‌లాల్ రక్షకుడైన స్టీఫెన్ నేడుంపల్లిగా ఎదిగే క్ర‌మాన్ని ఈ ట్రైల‌ర్ లో అద్భుతంగా ఆవిష్క‌రించారు. ఎంపురాన్ ట్రైలర్ పికె రాందాస్ వాయిస్ ఓవర్‌తో ఇంట్రెస్టింగ్ నోట్ తో ప్రారంభమైంది. తన పిల్లలు తన వారసులు కాదని, తనను అనుసరించే వారు తన పిల్లలనే పంచ్ లైన్ ఆక‌ట్టుకుంటుంది. ఆ తర్వాత జతిన్ రాందాస్ గా టోవినో థామస్‌ను ప‌రిచ‌యం చేసారు. మంజు వారియర్ ప్రియా రాందాస్ తన కుమార్తె తన జీవితంలో ఏకైక ఆశ అంటూ ఎమోష‌న్ ని ర‌గిలించిన సీన్ ర‌క్తి క‌ట్టిస్తోంది.

ట్రైలర్ వీక్షించే కొద్దీ యాక్షన్ మోడ్‌లో ర‌క్తి క‌ట్టించింది. డ్రగ్ మాఫియా.. జిహాదీ గ్రూపులు K-A (ఖురేష్ అబ్ రామ్) రంగ ప్ర‌వేశంతో ప్ర‌చార చిత్రం మ‌రింత‌ వేడెక్కింది. ట్రైలర్ ప్రారంభమైన దాదాపు ఒక నిమిషం తర్వాత మోహన్ లాల్ మాస్ ఎంట్రీ ఇవ్వ‌డం, అప్ప‌టివ‌ర‌కూ బిల్డ‌ప్ షాట్లు ర‌క్తి క‌ట్టించాయి. మోహన్ లాల్ అక‌ స్టీఫెన్ నెడుంపల్లి గురించి తెలుసుకునే కొద్దీ గ‌గుర్పాటుకు గురి చేసే చాలా విష‌యాల‌న్నాయి. లాల్ ఎంట్రీకి ముందు గ్రూపులు గ్రూపు రాజ‌కీయాలు చ‌ర్చ‌లు ర‌క్తి క‌ట్టిస్తాయి. పృథ్వీరాజ్ స్టైలిష్ అవ‌తార్ లో జాయెద్ మసూద్‌గా కనిపించాడు.

ట్రైలర్ ముగింపులో దేవుని స్వంత భూమికి తిరిగి రావాలని కోరుకుంటున్నందున.. మీరు ఎవరు? అనే ప్ర‌శ్న‌. దానికి ఒకే ఒక్క స‌మాధానం.. మోహన్ లాల్ తన గంభీర‌మైన‌ స్వరంతో 'లూసిఫర్' అని అంటాడు!. రాజ‌కీయాలు మాఫియా అంశాలు ట్రైల‌ర్ ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తున్నాయి. ఇది భారీత‌నం నిండిన మ‌రో లెవ‌ల్ సినిమా అని అర్థ‌మ‌వుతోంది. విజువ‌ల్ రిచ్ అంశాల‌తో పృథ్వీరాజ్ ఈ సినిమాని గ్రాండియ‌ర్ గా రూపొందించార‌ని ట్రైల‌ర్ చెబుతోంది. L2- ఎంపురాన్ .. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకుడిగా అరంగేట్రం చేసిన లూసిఫర్‌కి సీక్వెల్. L2- ఎంపురాన్ మార్చి 27న థియేటర్లలో విడుదల కానుంది.


Full View
Tags:    

Similar News