ఆ సినిమా కోసం సూపర్ స్టార్ రూపాయి కూడా తీసుకోలేదట!
ఈ సినిమా మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ తో కలిసి మోహన్ లాల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.;
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. 40 ఏళ్లుగా ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నారాయన. ఇప్పటికే ఎన్నో సినిమాలతో ఆడియన్స్ ను అలరించిన మోహన్ లాల్ నటించిన తాజా సినిమా ఎల్2: ఎంపురాన్. ఈ సినిమా మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ తో కలిసి మోహన్ లాల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూలో మోహన్ లాల్ ఆయన కెరీర్ గురించి, తన అభిమానుల గురించి మాట్లాడారు. తాను చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 47 ఏళ్లు అవుతుందని, తన కెరీర్లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయని ఆయన అన్నారు. అంతేకాదు తన విజయం వెనుక ఎంతోమంది ఉన్నారని ఆయన తెలిపారు. దర్శకనిర్మాతలు తనను నమ్మి విభిన్నపాత్రలు ఇచ్చినందుకే తాను ఇంతమంది అభిమానుల్ని సంపాదించుకోగలిగానని మోహన్ లాల్ అన్నారు.
బాక్సాఫీస్ నెంబర్ల గురించి కూడా లాలెట్టన్ మాట్లాడారు. తన కెరీర్లో రూ.100 కోట్ల సినిమాలు ఎన్నో ఉన్నాయని, కానీ వాటికంటే ఆడియన్స్ ప్రేమ, అభిమానం ముఖ్యమని, ఒక నటుడికి కలెక్షన్స్ ఎంత ముఖ్యమో, ఆడియన్స్ ను మెప్పించడం కూడా అంతే ముఖ్యమని ఆయన తెలిపారు. మలయాళ ఆడియన్స్ చాలా గొప్పవారని, మంచి కంటెంట్ ను ఎప్పుడూ ఆదరిస్తారని, అందుకే తనకు వేరే భాషలో సినిమాలు చేయాలనిపించలేదని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.
ఇక అదే ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ, లూసీఫర్2 సినిమా తెరకెక్కిందంటే దానికి మెయిన్ రీజన్ మోహన్ లాలే అన్నారు. ఈ సినిమా కోసం ఆయన పడిన కష్టం చాలా ఎక్కువని చెప్పిన పృథ్వీరాజ్, లూసీఫర్2 కోసం మోహన్ లాల్ ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయలేదని, ఆయనకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ ను కూడా సినిమా కోసమే ఖర్చు పెట్టామని, సినిమా చూశాక ప్రతీ సీన్ ఎంతో రిచ్ గా ఉండటం చూస్తే మీక్కూడా ఈ విషయం అర్థమవుతుందని పృథ్వీరాజ్ తెలిపారు. లూసీఫర్2 కు ఎంతోమంది ఫారినర్స్ కూడా హెల్ప్ చేశారని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.
ఎల్2: ఎంపురాన్ విషయానికొస్తే మోహన్ లాల్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ పొలిటికల్ థ్రిల్లర్ లూసీఫర్ కు ఇది సీక్వెల్ గా రూపొందింది. లూసీఫర్ కు సీక్వెల్ గా వస్తున్న మూవీ కావడంతో దీనిపై కూడా భారీ అంచనాలున్నాయి. ఆల్రెడీ రిలీజైన టీజర్, ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. సినిమా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని మోహన్ లాల్, పృథ్వీరాజ్ ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు.