నిత్యా ఇంట్లో కులానికి చోటు లేదు

జూనియ‌ర్ సౌంద‌ర్య‌గా నిత్యామీన‌న్ తెలుగు నాట అభిమానం అందుకుంది. తెలుగు రాష్ట్రాల‌లో త‌న‌కు భారీ ఫాలోయింగ్ ఉంది.

Update: 2024-09-10 16:30 GMT

జూనియ‌ర్ సౌంద‌ర్య‌గా నిత్యామీన‌న్ తెలుగు నాట అభిమానం అందుకుంది. తెలుగు రాష్ట్రాల‌లో త‌న‌కు భారీ ఫాలోయింగ్ ఉంది. జాతీయ అవార్డు గ్రహీత, అందాల క‌థానాయిక‌ నిత్యా మీనన్ ఇటీవల చాలా మంది అభిమానులకు తెలియని వ్యక్తిగత విష‌యాల‌పై ముచ్చ‌టించారు. `తిరుచిత్రంబళం` చిత్రంలో తన నటనకుగాను ప్రతిష్టాత్మక జాతీయ ఉత్తమ నటి అవార్డుకు ఎంపికైన సంగ‌తి విధిత‌మే. నిత్యా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ గురించి వెల్ల‌డించింది.

నిజానికి నిత్యాకు జ‌త‌గా ఉండే `మీన‌న్` త‌న ఇంటి పేరేనా? అనే సందేహం చాలా కాలంగా అభిమానుల‌కు ఉంది. కానీ నిత్య ఇంటిపేరు `మీనన్` కాదు. త‌న‌ అసలు పేరు NS నిత్య. ఇక్కడ N అంటే నళిని.. ఆమె తల్లి పేరు. S అంటే సుకుమార్.. అది తండ్రి పేరు. ముఖ్యంగా నిత్యా కుటుంబంలో ఇంటిపేర్లు ఉపయోగించరు. వారి పేర్లతో కులాన్ని అనుసంధానించ‌రు. ఇది వారి కుటుంబ అచేత‌న‌ నిర్ణ‌యం.

తన వృత్తిలో భాగంగా తరచుగా విదేశాలకు వెళ్లడం వల్ల నిత్య తన పాస్‌పోర్ట్‌లో `మీనన్` అనే ఇంటిపేరును చేర్చవలసి వచ్చింది. ఆసక్తికరంగా మీన‌న్ పేరు వ‌ల్ల త‌ను కేరళకు చెందిన యువ‌తి అని చాలామంది ఊహించారు. ప్రొడక్షన్ హౌస్‌లు తరచూ కొచ్చి నుండి విమాన టిక్కెట్ల గురించి ఆరా తీస్తూ నిత్యాను సంప్రదిస్తాయి. ఇది నిత్యా మీన‌న్ కు ఎప్పుడూ నవ్వు తెప్పిస్తుంది. వాస్తవానికి త‌న‌ కుటుంబం బెంగళూరుకు చెందినది. మూడు తరాలుగా అక్కడే నివసిస్తోంది.

చదువుకునే రోజుల్లోనే కన్నడ రెండో భాష అని నిత్యా వెల్లడించి పలువురిని ఆశ్చర్యపరిచింది. ఈ ఊహించని వివరాలు నిత్యా విభిన్న నేపథ్యాల‌ను వెల్ల‌డిస్తున్నాయి. `బార్న్ ఐడెంటిటీ` సినిమాలో ప్ర‌ధాన పాత్ర త‌ర‌హాలో త‌న గుర్తింపు ఏమిట‌న్న‌ది ఎప్ప‌టికీ స‌స్పెన్స్ గా ఉండిపోతోంది. ఈ స‌వాల్ ని నిత్యా అధిగమిస్తోంది!

Tags:    

Similar News