ఓదెలా 2: బ్లాస్ట్ చేసే డేట్ పట్టేసిన తమన్నా!
గ్లామర్ రోల్స్ లో వరుసగా కనిపించిన ఈ మిల్కీ బ్యూటీ, ఇప్పుడు ఓ డివోషనల్ థ్రిల్లర్‌లో నాగ సధ్విగా కనిపించనుంది.;
ఈమధ్య కాలంలో హీరోయిన్స్ మధ్య పోటీ మరింత ఎక్కువగా పెరిగింది. సీనియర్ హీరోయిన్స్ చాలా వరకు లేడి ఓరియెంటెడ్ కాన్సెప్ట్ లతోనే బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. హీరోలతో సంభంధం లేకుండా వారి కంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ తో సోలో సక్సెస్ కొట్టాలని చూస్తున్నారు.
ఇక ఇప్పుడు తమన్నా భాటియా కూడా అదే రూట్లో ప్రయత్నం చేస్తోంది. గ్లామర్ రోల్స్ లో వరుసగా కనిపించిన ఈ మిల్కీ బ్యూటీ, ఇప్పుడు ఓ డివోషనల్ థ్రిల్లర్‌లో నాగ సధ్విగా కనిపించనుంది.
‘ఓదెలా రైల్వే స్టేషన్’ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘ఓడెలా 2’లో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోంది. శివ భక్తురాలిగా కనిపించబోతున్న ఈ పాత్ర కోసం తమన్నా లుక్, బాడీ లాంగ్వేజ్‌పై చాలా కష్టపడినట్టు సమాచారం. అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కాంతార ఫేమ్ అజినిష్ లోకనాథ్ సంగీతం అందించారు. ఈసారి తమన్నా స్ట్రాంగ్ హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది.
ఇటీవల ఆమె చేసిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయాయి. ఓటీటీలో కొన్ని ప్రయత్నాలు చేసినా, ఫలితాలు మిశ్రమంగానే నిలిచాయి. అందుకే సంపత్ నంది రచన, దర్శకత్వ పర్యవేక్షణలో వస్తున్న ‘ఓదెలా 2’ సినిమాపై ఈసారి భారీ నమ్మకంతో ఉంది. తన కెరీర్‌లో నిలిచిపోయేలా ఈ చిత్రం మంచి విజయం సాధిస్తే, తమన్నా మళ్లీ టాప్ రేసులోకి రావొచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక బాక్సాఫీస్ పరంగా చూస్తే ఈ సినిమాకు పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ సెట్టయ్యింది. ఏప్రిల్ 17న ‘ఓదెలా 2’ సినిమా థియేటర్లలోకి రానుంది. ఇది ఏకంగా సమ్మర్ సెలవులు మొదలయ్యే టైమ్. చదువులకు అలసటగా ఉన్న విద్యార్థులకు ఓ థ్రిల్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ డేట్‌ను ఫిక్స్ చేసినట్టు సమాచారం. ముఖ్యంగా ఈ వేసవిలో పెద్దగా భారీ సినిమాల విడుదల లేకపోవడంతో, ఓ డివైన్ బ్యాక్‌డ్రాప్ కథా చిత్రం మంచి కలెక్షన్లు రాబట్టే ఛాన్స్ ఉంది.
ఏప్రిల్ మిడ్ నుంచే టార్గెట్ ఆడియన్స్ థియేటర్లవైపు మొగ్గు చూపే అవకాశం ఎక్కువ. ఈ సినిమా పోస్టర్‌లో తమన్నా లుక్ ఇంటెన్స్‌గా ఉండగా, ఆమె సగం ముఖం, బ్యాక్‌డ్రాప్‌లో ఆలయ నిర్మాణాలు, రక్తసిక్త రూపం ఆధ్యాత్మికంగా, టెర్రిఫిక్‌గా కనిపిస్తోంది. వశిష్ట సింహ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మాస్ మిస్టిక్ థ్రిల్లర్‌ల మిక్స్‌గా ఉండబోతోందని సమాచారం. డి. మధు నిర్మాణంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈసారి తమన్నా పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితమవకపోవడం విశేషం. ఇలాంటి డివైన్ థ్రిల్లర్లు వేసవిలో బాగానే క్లిక్ అవుతాయి. మరి తమన్నా ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.