లీకైన వీడియోపై పృథ్వీరాజ్ స్పందన ఇదే
రాజమౌళి- సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో ఎస్ఎస్ఎంబీ29 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.;
రాజమౌళి- సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో ఎస్ఎస్ఎంబీ29 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రాజమౌళి ఏ విషయాన్నైనా టైమ్ వచ్చే వరకు రివీల్ చేయడు. కరెక్ట్ టైమ్ చూసి ఆ విషయాన్ని రివీల్ చేసి సినిమాపై హైప్ పెంచుతూ ఉంటాడు జక్కన్న. కానీ ఇప్పుడు దానికంటే ముందే ఎస్ఎస్ఎంబీ29 నుంచి ఓ వీడియో లీకైంది.
ఆ లీకైన వీడియోలో మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇద్దరూ ఉండటం వల్ల నెటిజన్ల దృష్టిని బాగా ఆకర్షించడంతో పాటూ క్షణాల్లోనే ఆ వీడియో వైరలైంది. అయితే రీసెంట్ గా ఎల్2: ఎంపురాన్ ప్రమోషన్స్ లో పాల్గొన్న పృథ్వీరాజ్ సుకుమారన్ కు ఈ లీకులపై ప్రశ్న ఎదురవగా దానికి ఆయన చెప్పిన సమాధానం అందరినీ ఆలోచింపచేసేదిలా ఉంది.
లీకైన వీడియోలను చూడ్డానికి జనాలు ఎందుకు ఎగబడతారో తనకు అర్థం కావడం లేదని, అందులో ఉన్న గొప్పేంటో కూడా తెలియడం లేదని, ఒక పెద్ద సినిమాకు సంబంధించిన లీకైన వీడియోను చూస్తే మీ ఎక్స్‌పీరియెన్స్ ను మీరే చంపుకున్నట్టని, మామూలుగా థియేటర్లలో హై ఇచ్చే వీడియో అయినా సరే ఇలా లీకుల రూపంలో చూస్తే ఏమీ ఉండదని ఎంతో తెలివిగా చెప్పాడు పృథ్వీరాజ్.
వాస్తవానికి పృథ్వీరాజ్ చెప్పింది వందకి వందశాతం నిజం. దానికి కారణం లీకైన వీడియోలకు ఎలాంటి సీజీ కానీ, వీఎఫ్ఎక్స్ కానీ, బీజీఎం కానీ ఉండదు. దాని వల్ల సీన్ లోని ఇంటెన్సిటీ మనకు అర్థం కాదు. రేపు బిగ్ స్క్రీన్ పై ఆ సీన్ ను చూసినా పెద్దగా కిక్ ఇవ్వదు. అయితే పృథ్వీరాజ్ చెప్పిన మాటలు ఆలోచింపచేసేలా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలను మాత్రం వైరల్ చేయకుండా ఎవరూ ఆపలేరు.
ఇక రాజమౌళి సినిమాలో పనిచేసిన ఎక్స్‌పీరియెన్స్ గురించి ఆయన్ని అడగ్గా, తాను ఈ ప్రాజెక్టులో ఇప్పుడు జాయిన్ కాలేదని, సంవత్సరం కంటే ముందునుంచే ఈ టీమ్ తో కలిసి వర్క్ చేస్తున్నానని, ప్రస్తుతం సెట్స్ లో ఉన్న సినిమా గురించి తాను ఇప్పుడేం మాట్లాడలేనని, త్వరలోనే టీమ్ నుంచి అప్డేట్స్ రావాలనుకుందామని పృథ్వీరాజ్ సుకుమారన్ అన్నారు. సంవత్సరం నుంచి రాజమౌళి ప్రాజెక్టులో పృథ్వీరాజ్ భాగమైనప్పటికీ ఆ విషయాన్ని రాజమౌళి అంత సీక్రెట్ గా ఎలా ఉంచగలిగాడనేది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.