మాస్ మహారాజా.. ఎప్పుడూ చేయని కొత్త జానర్
చిత్ర సీమలో క్రమక్రమంగా సైన్స్ ఫిక్షన్ సినిమాల ట్రెండ్ ఎక్కువ అవుతున్నట్లు కనిపిస్తోంది.
చిత్ర సీమలో క్రమక్రమంగా సైన్స్ ఫిక్షన్ సినిమాల ట్రెండ్ ఎక్కువ అవుతున్నట్లు కనిపిస్తోంది. రీసెంట్గా మార్క్ ఆంటోనీ, 7:11 PM సినిమాలు రాగా.. ప్రస్తుతం భారీ బడ్జెట్‌తో ప్రభాస్ కల్కి రూపుదిద్దుకుంటోంది. అయితే ఇప్పుడు మరో సైన్ ఫిక్షన్ సినిమా రాబోతుంది. ఇందులో మాస్ మహారాజా రివితజ ప్రధాన పాత్ర పోషించబోతుండటం విశేషం.
వచ్చే ఏడాది ఈ సైన్స్ ఫిక్షన్ జానర్లో సినిమా చేయబోతున్నట్లు తెలిపారు రవితేజ. ప్రస్తుతం ఆయన తన పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా మీడియాతో ముచ్చటించిన ఆయన.. ఈ విషయం తెలిపారు. ఇకపై అన్నీ డిఫరెంట్ జానర్స్‌లో సినిమా చేసేలా ప్రయత్నిస్తానని చెప్పిన ఆయన.. సైన్స్ ఫిక్షన్ మూవీ కూడా చేస్తానని స్పష్టత ఇచ్చారు. అయితే ఈ సినిమా వివరాలను ఆయన చెప్పలేదు.
అసలే రవితజే మాస్-యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అన్న సంగతి తెలిసిందే. చాలా కాలం నుంచి రొటీన్ కమర్షియల్ సినిమాలే చేస్తున్నారు. ఏదో మధ్యలో అలా రాజా ది గ్రేట్ లాంటి సినిమాలను చేశారు. కానీ మళ్లీ రొటీన్ కమర్షియలే చేస్తున్నారు. అయితే ఇకపై అలా కాకుండా.. ప్రతి సినిమా కొత్త జానర్ టచ్ చేస్తానని అన్నారు.
ప్రస్తుతం ఈగల్ అనే ఓ భారీ బడ్జెట్ సినిమా కూడా చేస్తున్నారు రవితేజ. ఇది స్పై థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇంకా ఈ చిత్రాలతో పాటే సైన్స్ ఫిక్షన్ సినిమాతో సహా ఓ ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీ చేయబోతున్నట్లు రవితేజ తన లైనప్ గురించి చెప్పారు. యవ దర్శకులతో కూడా పని చేస్తానని అన్నారు రవితేజ. అలానే రాజమౌళి లాంటి సీనియర్ దర్శకులతోనూ మరోసారి కలిసి పనిచేయాలని ఉందని తన మనసులో మాటను చెప్పారు.