మెగా ప‌వ‌ర్ స్టార్ బ‌ర్త్ డే ట్రీట్ ఏంట‌బ్బా?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ 16వ చిత్రం బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-03-22 06:16 GMT

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ 16వ చిత్రం బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్స్ట్ నేప‌థ్యంతో తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే కొంత భాగం షూటింగ్ కూడా పూర్త‌యింది. మైసూర్, హైద‌రాబాద్, ఢిల్లీ లాంటి ప్ర‌దేశాల్లో షూటింగ్ నిర్వ‌హించారు. అయితే యూనిట్ అధికారికంగా మాత్రం షూటింగ్ అప్ డేట్స ఏవీ ఇంకా వెల్ల‌డించ‌లేదు.

అలాగే సినిమా టైటిల్ కూడా ప్ర‌క‌టించ‌లేదు. కానీ ప్ర‌చారంలో `పెద్ది` అనే టైటిల్ బ‌లంగా వినిపిస్తుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ కావ‌డంతో? పెద్ది టైటిల్ స్టోరీకి ప‌క్కాగా యాప్ట్ అవుతుంద‌ని గ‌ట్టిగా ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇదే టైటిల్ క‌న్ప‌మ్ అవుతుంద‌ని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. అలాగే చ‌ర‌ణ్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కూడా ఇంత‌వ‌ర‌కూ బ‌య‌ట‌కు రాలేదు. ఈ నేప‌థ్యంలో మెగా ప‌వ‌ర్ స్టార్ బర్త్ డే సంద‌ర్భంగా బుచ్చిబాబు ఇంట్రెస్టింగ్ విష‌యాలు రివీల్ చేసే అవ‌కాశం క‌నిపిస్తుంది.

చ‌ర‌ణ్ బ‌ర్త్ డే మార్చి 27. ఈ పుట్టిన రోజు చ‌ర‌ణ్ కు స్పెష‌ల్ గా నిలిచేలా...అభిమానుల‌కు గుర్తుండి పోయేలా అన్న పూర్ణ స్టూడియోస్ లో ఓ ఫోటో షూట్ నిర్వ‌హించారుట‌. అయితే ఈ ఫోటో షూట్ దేనికి సంబంధించింది అన్న‌ది క్లారిటీ లేదు. మార్చి 27న ప్ర‌క‌టించే విష‌యానికి సంబంధించా? షూట్ లో భాగంగా ఈ ఫోటో షూట్ నిర్వ‌హించారా? అన్న‌ది క్లారిటీ లేదు.

కానీ అభిమానులు మాత్రం అన్న బ‌ర్త్ డేకి భారీగానే ప్లాన్ చేస్తున్నార‌ని ఆశ‌లు పెట్టుకున్నారు. ఇందులో రామ్ చ‌ర‌ణ్ కి జోడీగా జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు. ఆయ‌న బాణీలతో సినిమా పీక్స్ కి చేరుతుంద‌ని బుచ్చిబాబు ఎంతో కాన్పిడెంట్ గా ఉన్నాడు. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది మార్చి 26న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. అంటే సినిమా రిలీజ్ కి ఇంకా ఏడాది స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News