వీరమల్లు రిలీజ్ కాదు అన్న నమ్మకంతోనే 'సింగిల్' రిలీజ్ కి రెడీ అవుతుందా?
పవన్ కళ్యాణ్ పై షూట్ చేయాల్సిన నాలుగు రోజుల పెండింగ్ చిత్రీకరణకు వచ్చే నెల మొదటి వారంలోనే డేట్లు ఇస్తున్నట్లు ప్రచారంలో ఉంది.;
'హరిహర వీరమల్లు' మే 9న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ కొత్త తేదీని ప్రకటించిన సంగతి తెలిసిందే. డబ్బింగ్ పనులు నిన్నటి రోజున మొదలైన నేపథ్యంలోనూ రిలీజ్ విషయాన్ని మరోసారి కన్పమ్ చేసారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో మే 9న రిలీజ్ చేయడం లాంఛన మేనని ప్రేక్షకాభిమానులు సైతం బలంగా నమ్ముతున్నారు. పవన్ కళ్యాణ్ పై షూట్ చేయాల్సిన నాలుగు రోజుల పెండింగ్ చిత్రీకరణకు వచ్చే నెల మొదటి వారంలోనే డేట్లు ఇస్తున్నట్లు ప్రచారంలో ఉంది.
ఇంతకు మించి వెనుక తిప్పించుకోవడం కూడా పవన్ కు భావ్యం కాదు కాబట్టి ఎంత బిజీగా ఉన్నా? నాలుగు రోజులు ఇచ్చేయాలని ఆయన స్ట్రాంగ్ గానే కనిపిస్తున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మే 9న మరో సినిమా కూడా రిలీజ్ అవుతున్నట్లు తెలుస్తోంది. శ్రీ విష్ణు కథానాయకుడిగా నటిస్తోన్న `సింగిల్` చిత్రాన్ని మే 9న రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేసారు. అయితే ఈ సినిమా నిర్మాణంలో గీతా అర్స్ట్ కూడా భాగస్వామి. అల్లు అరవింద్ ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
ఇది యూత్ ఫుల్ ఎంటర్ టైనర్. శ్రీవిష్ణు సినిమాలకు యువత బాగానే కనెక్ట్ అవుతుంది. అయితే వీరమల్లు డబ్బింగ్ పనులు మొదలైన రోజునే సింగిల్ రిలీజ్ పోస్టర్ రావడం ఆసక్తికరంగా మారింది. శ్రీ విష్ణు పవన్ కళ్యాణ్ పోటీ కాదు. కానీ పోటీగా ప్లాన్ చేస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సమర్పకుడు అల్లు అరవింద్ కాబట్టి రిలీజ్ పరంగా ఎలాండి ఢోకా ఉండదు. చేతిలో కావాల్సినన్ని థియేటర్లు ఉన్నాయి. డిస్ట్రిబ్యేషన్ వ్యవస్థ ఆయన చేతుల్లో ఉంది. కాబట్టి `సింగిల్` కి థియేటర్ల కొరతేమి ఉండదు.
కాబట్టి వీరమల్లు రిలీజ్ కి ఉన్నా? `సింగిల్` బయపడాల్సిన పనిలేదు. వీరమల్లు చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇది పవన్ తొలి పాన్ ఇండియా సినిమా కాబట్టి పెద్ద ఎత్తున రిలీజ్ అవుతుంది. ఇది ఒక వెర్షన్ అయితే మే 9న కూడా వీరమల్లు రిలీజ్ కాదు అన్న నమ్మకంతోనే `సింగిల్` రిలీజ్ కి రెడీ అవుతుందా? అన్నది మరో కారణంగా నెట్టింట వైరల్ అవుతుంది.