వీడియో : విమానంలో, ఎయిర్‌పోర్ట్‌లో శ్రీలీల అల్లరి చూడండి
టాలీవుడ్‌లో మోస్ట్ బిజీ హీరోయిన్‌గా వరుస సినిమాలు చేస్తున్న శ్రీలీల త్వరలో నితిన్‌తో కలిసి 'రాబిన్‌హుడ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది;
టాలీవుడ్‌లో మోస్ట్ బిజీ హీరోయిన్‌గా వరుస సినిమాలు చేస్తున్న శ్రీలీల త్వరలో నితిన్‌తో కలిసి 'రాబిన్‌హుడ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాబిన్‌హుడ్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా నితిన్‌తో కలిసి శ్రీలీల తెగ హడావిడి చేస్తోంది. అంత పెద్ద హీరోయిన్ అయినప్పటికీ శ్రీలీల చాలా సరదాగా ఉంటుంది. తన కో స్టార్స్‌తో మాత్రమే కాకుండా మీడియా వారితోనూ, సోషల్ మీడియాలో నెటిజన్స్‌తోనూ చాలా సరదాగా చిట్ చాట్ చేయడం చాలా సార్లు చూశాం. శ్రీలీల ఎక్కడ ఉన్నా నవ్వులు చిందిస్తూ అక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా మార్చేస్తుందని అంటారు. అలాంటి శ్రీలీల వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల శ్రీలీల చేసిన విమాన ప్రయాణం కి సంబంధించిన వీడియో అది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిహారిక తో శ్రీలీల చేసిన విమాన ప్రయాణం, ఎయిర్ పోర్ట్‌లో చేసిన సందడిని ఆ వీడియోలో చూడవచ్చు. విమానంలో ఒకరి ముందు ఒకరు కూర్చుని సెల్ఫీ వీడియో తీసుకున్న శ్రీలీల, నిహారిక ఆ తర్వాత ఎయిర్ పోర్ట్‌లో సరదాగా ట్రాలీ తోలుతూ కనిపించారు. ట్రాలీలో శ్రీలీల కూర్చుని ఉంటే నిహారిక నెట్టుకు వెళుతున్న వీడియోను సైతం వీరిద్దరు షేర్ చేశారు. సాధారణంగా సెలబ్రిటీలు విమానంలో, ఎయిర్ పోర్ట్‌లో చాలా డీసెంట్‌గా సైలెంట్‌గా ఉంటారు. వారిని ఎవరైనా గుర్తు పడతారేమో అని భయంతో సైలెంట్‌గా మొహానికి మాస్క్ ధరించి మరీ కనిపించకుండా ఉంటారు. కానీ శ్రీలీల మాత్రం ఇలా ఎయిర్ పోర్ట్‌లో ట్రాలీలో కూర్చుని చిన్న పిల్ల మాదిరిగా వీడియో తీసుకుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిహారిక ఎంతో మంది స్టార్స్‌తో సరదా వీడియోలను చేసిన విషయం తెల్సిందే. ఈమె మహేష్ బాబు, ఏఆర్ రెహమాన్‌తో పాటు పలువురు బాలీవుడ్ స్టార్స్, సౌత్ స్టార్స్‌తో చేసిన సరదా వీడియోలు వైరల్ అయ్యాయి. సోషల్ మీడియా ద్వారా గుర్తింపు దక్కించుకున్న నిహారిక ఇప్పటికే సినిమాలు, సిరీస్‌ల్లోనూ నటిస్తోంది. ఇప్పటి వరకు హిందీ సినిమాలకు, వెబ్ సిరీస్‌లకు పరిమితం అయిన నిహారిక త్వరలోనే తెలుగు సినిమాల్లోనూ నటిస్తుందా అనేది చూడాలి. శ్రీలీలతో పాటు ఎంతో మంది స్టార్స్, సెలబ్రిటీలతో ఉన్న సన్నిహిత్యం కారణంగా ఇప్పుడు కాకున్నా భవిష్యత్తులో అయినా నిహారికకు సౌత్‌లో మంచి సినిమాలో నటించే అవకాశం దక్కవచ్చు.
ఇక శ్రీలీల సినిమాల విషయానికి వస్తే నితిన్‌తో కలిసి నటించిన 'రాబిన్‌హుడ్' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా తర్వాత తెలుగులో రవితేజతో కలిసి మాస్ జాతర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రవితేజతో కలిసి ధమాకా సినిమాలో నటించి హిట్ కొట్టిన శ్రీలీల మాస్ జాతర తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటుందా అనేది చూడాలి. ఇక కోలీవుడ్‌లో ఈమె పరాశక్తి సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తుంది. శివ కార్తికేయన్ హీరోగా రూపొందుతున్న ఆ సినిమాలో శ్రీలీల పాత్ర ప్రముఖంగా ఉంటుందని తెలుస్తోంది. తెలుగు, తమిళ్ సినిమాల్లోనే కాకుండా హిందీ సినిమాలోనూ శ్రీలీల నటించేందుకు సైన్ చేసింది. అనురాగ్ బసు తో శ్రీలీల వర్క్ చేయబోతుందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ సినిమాపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.