ఉగాది స్పెషల్ ఎలా ప్లాన్ చేస్తున్నారబ్బా?
ఒకప్పుడు ఉగాది అంటే కొత్త సినిమాల ప్రారంభోత్సవాలతో ఇండస్ట్రీ కళకళలాడేది. ఒక్క రోజులోనే 30-40 సినిమాలైనా లాంచ్ అయ్యేవి.;
ఒకప్పుడు ఉగాది అంటే కొత్త సినిమాల ప్రారంభోత్సవాలతో ఇండస్ట్రీ కళకళలాడేది. ఒక్క రోజులోనే 30-40 సినిమాలైనా లాంచ్ అయ్యేవి. స్టార్ హీరోల చిత్రాలతో పాటు అన్ని రకాల చిత్రాలు లాంచింగ్ లు అయ్యేవి. ముఖ్యంగా చిన్న సినిమాలు ఎక్కువగా ఓపెనింగ్ లు జరిగేవి. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు.
చిన్న సినిమాలు పెద్దగా నిర్మాణం జరగలేదు. నిర్మాణ వ్యయం పెరిగిపోవడంతో సినిమా నిర్మించడానికి కొత్త నిర్మాతలు ఎవరూ ముందుకు రావడం లేదు. ఉన్న పాతవాళ్లే అలాగే కొనసాగుతున్నారు. కరోనా తర్వాత పరిస్థితి మరింత జఠిలంగానూ మారింది. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితుల నుంచి బయట పడు తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఉగాదికి సినిమా ఓపెనింగ్ లు కనీస స్థాయిలోనైనా ఉంటాయని ఇండస్ట్రీ భావిస్తుంది.
మరేం జరుగుతుందన్నది చూడాలి. అలాగే ఇదే రోజు చాలా సినిమాలకు సంబంధించి నిర్మాణ సంస్థలకు అధికారికంగా అప్ డేట్ ను అందిస్తుంటాయి. మంచి గడియలు చూసుకుని విషయాన్ని మీడియాకి లీక్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ కు సంబంధించి విషయాలు తెలిసే అవకాశం ఉంది. ప్రభాస్ హీరోగా `రాజాసాబ్`, `పౌజీ` తెరకకెక్కుతున్నాయి. రెండు ఆన్ సెట్స్ లో ఉన్నాయి.
అలాగే ` స్పిరిట్` కి సంబంధించి సందీప్ రెడ్డి వంగా రెడీగా ఉన్నాడు. కాబట్టి ఈ మూడు సినిమాలపై ఆయా నిర్మాణ సంస్థల నుంచి ఏదైనా క్రేజీ అప్ డేట్ రావొచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న `హరిహర వీరమల్లు`, `ఓజీ` సినిమాల రిలీజ్ విషయంలోనూ క్లారిటీ రావొచ్చు. వీరమల్లు ఇప్పటికే మే 9న రిలీజ్ గా ప్రకటించారు.` ఓజీ` కూడా రిలీజ్ తేదీ రివీల్ చేసే అవకాశం ఉంది. అలాగే అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన సినిమాలపై కూడా అప్ డేట్ ఇచ్చే ఛాన్స్ ఉంది.
నాగచైతన్య హీరోగా కార్తీక్ దండు ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే అఖిల్ లెనిన్ ప్రాజెక్ట్ ....నాగార్జున నటించబోయే సినిమా విషయాలు వెల్లడించే ఛాన్స్ ఉంది. అలాగే చిరంజీవి నటిస్తోన్న `విశ్వంభర` రిలీజ్ ఎప్పుడు? అన్నది క్లారిటీ లేదు. దీనిపైనా క్లారిటీ వస్తుందని మెగా అభిమానులు కాన్పిడెంట్ గా ఉన్నారు.