స్టార్ కిడ్స్‌కి లైంగిక వేధింపులు..!
టీవల స్టార్ కిడ్ వరలక్ష్మి శరత్ కుమార్ సైతం లైంగిక వేధింపుల బాధితురాలినే అంటూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది.;
చిన్న వయసులో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న వారు చాలా మంది ఉన్నారు. ఈమధ్య కాలంలో పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించిన అవగాహణ కల్పించడంతో పాటు సోషల్ మీడియా పరిధి బాగా పెరగడంతో లైంగిక వేధింపులు తగ్గాయి. కానీ ఒకప్పుడు ఇంట్లో వాళ్ళు లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటనలు చాలానే ఉన్నాయి. సామాన్యులకు మాత్రమే కాకుండా సెలబ్రెటీలకు కూడా ఏదో ఒక సమయంలో లైంగిక వేధింపులు తప్పలేదు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్‌గా ఉన్న పలువురు లైంగిక వేధింపుల గురించి మాట్లాడుతూ చిన్నతనంలో తాము ఎదుర్కొన్న ఆ దారుణాలు పలు సందర్భాల్లో చెప్పడం మనం చూశాం. హీరోయిన్స్ మాత్రమే కాకుండా కొందరు మగవారు సైతం తాము చిన్నతనంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామని చెబుతున్నారు.
ఇటీవల స్టార్ కిడ్ వరలక్ష్మి శరత్ కుమార్ సైతం లైంగిక వేధింపుల బాధితురాలినే అంటూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ పెద్ద స్టార్ అనే విషయం తెల్సిందే. అలాంటి స్టార్ కిడ్ అయిన వరలక్ష్మికి కూడా లైంగిక వేధింపులు ఎదురయ్యాయి అంటే అప్పట్లో పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ ఒక తమిళ్ రియాల్టీ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తుంది. ఆ షో లోని ఒక లేడీ కంటెస్టెంట్ మాట్లాడుతూ తాను చిన్నతనంలో దారుణమైన లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. చిత్ర హింసలు అనుభవించిన తాను ఈ స్థాయికి వచ్చేందుకు చాలా కష్టపడ్డాను అంటూ ఆ కంటెంస్టెంట్ చేబుతూ ఉంటే వరలక్ష్మి తో పాటు అక్కడ ఉన్న వారు అంతా కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఆ కంటెస్టెంట్ తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెబుతున్న సమయంలో వరలక్ష్మి శరత్ కుమార్ స్పందిస్తూ 'నీది నాది ఒకటే కథ' అంది. తాను కూడా చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురి అయ్యాను. ఒకసారి ఐదుగురు తనను లైంగికంగా వేధించారని, ఆ సమయంలో తనకు ఏమీ తెలియలేదని, ఆ సంఘటన తలచుకుంటే ఇప్పటికీ భయం కలుగుతుందని కన్నీళ్లు పెట్టుకుంటూ వరలక్ష్మి శరత్ కుమార్ చెప్పుకొచ్చింది. గతంలోనూ వరలక్ష్మి శరత్ కుమార్ తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల ఘటన గుర్తు చేసుకుంది. తీవ్రమైన మనోవేదనకు గురి అయినట్లు చెప్పుకొచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్ ఈతరం పిల్లలకు అలాంటి విషయాల పట్ల అవగాహణ కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
వరలక్ష్మి శరత్ కుమార్ సినిమాల విషయానికి వస్తే గత ఏడాదిలో ఈమె నటించిన పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. హీరోయిన్‌గా ఇండస్ట్రీలో అడుగు పెట్టి, పలు సినిమాలు చేసిన వరలక్ష్మి శరత్ కుమార్ నేగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కథలో ప్రాముఖ్యత ఉన్న ముఖ్య పాత్రల్లో నటించడం ద్వారా తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీలో వరలక్ష్మి శరత్ కుమార్ బిజీ బిజీగా ఉన్నారు. గత ఏడాది వరలక్ష్మి నటించిన హనుమాన్, మాక్స్ సినిమాలతో పాటు పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ ఏడాదిలోనూ ఈమె నుంచి పలు పెద్ద సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలు రాబోతున్నాయి. వరలక్ష్మి హీరోయిన్‌గా ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా సైతం రూపొందించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.