ఇద్దరు హీరోలు.. ఒక హీరోయిన్ చనిపోతారా?

అయితే ఇప్పుడు TV5 న్యూస్ ఛానెల్ లో విడుదల చేసిన లీక్‌డ్‌ ఆడియోలో వేణు స్వామి కామెంట్ చేసినట్లు ప్రచారం చేశారు.;

Update: 2025-03-22 04:00 GMT

టాలీవుడ్‌ సర్కిల్‌లో మరోసారి వేణు స్వామి కామెంట్స్ కలకలం రేపుతున్నాయంటూ మీడియాలో కథనాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా సెలబ్రిటీల భవితవ్యాన్ని చెప్పే అతని ప్రకటనలు తరచూ వివాదాస్పదంగా మారుతున్నాయి. గతంలో నాగ చైతన్య, సమంత విడాకుల గురించి ముందే చెప్పిన వేణు, ఆ తర్వాత ఇతర సెలబ్రిటీలు, రాజకీయ నేతలపై చేసిన వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కొన్నాడు.

ఇటీవల నాగ చైతన్య-శోభిత లింకప్ గురించి అనవసరంగా మాట్లాడినందుకు ఫిలిం జర్నలిస్టులు, మహిళా కమిషన్ చట్టపరమైన చర్యలు తీసుకున్నాయి. అప్పట్లో ఇకపై సెలబ్రిటీ జాతకాలు చెప్పబోనని వీడియో రిలీజ్ చేశారు వేణు స్వామి. అయితే ఇప్పుడు TV5 న్యూస్ ఛానెల్ లో విడుదల చేసిన లీక్‌డ్‌ ఆడియోలో వేణు స్వామి కామెంట్ చేసినట్లు ఉంది.

లీక్ అయిన ఆడియో ప్రకారం.. “నేను ముగ్గురు చనిపోతారు అని చెప్పా.. ఒక హీరో ఒక హీరోయిన్ చనిపోతారు.. అందులో విజయ్ సమంత ప్రభాస్.. వీరిలో ఎవరైనా ఒకరు చేసుకుంటారు. నా లెక్క ప్రకారం విజయ్ దేవరకొండ చేసుకుంటాడు. బయటకు రావడానికి టైమ్ పడుతుంది. మీడియాకు ఎవరికి ఏం చెప్పలేదు. అతని సినిమా వాయిదా పడుతుంది... ప్రభాస్ గురించి చెప్పాలంటే.. ఆయనపై మాట్లాడటానికి ఇప్పుడే సరైన సమయం కాదు. తర్వాత మాట్లాడతా".

ఈ కామెంట్స్ వేణు స్వామి చేసినట్లు ఆడియో లో ఉంది . దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇక వ్యాఖ్యలపై ప్రముఖులు సీరియస్ అవుతున్నారు. అది వేణు స్వామి వాయిస్ అంటూ TV5 డిబేట్ లో ఉన్న సీనియర్ జర్నలిస్టు ప్రభు కూడా కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు వేణు స్వామి ఈ విషయంలో పెద్దగా స్పందించలేదు. గతంలోనే మళ్ళీ సెలబ్రెటీల పర్సనల్ విషయాలపై కామెంట్ చేయనని చెప్పిన ఆయన ఇలా నిజంగానే మాట్లాడారా అనేది వైరల్ అవుతోంది. మరి వేణు స్వామి ఈ కథనాలపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Tags:    

Similar News