సెగ్మెంట్ ముచ్చట: ఆ ఎమ్మెల్యేలు హాట్ బ్రో.. !
ఏపీలో ఎమ్మెల్యేల తీరు ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉండడం గమనార్హం. అన్ని వేళ్లూ ఒకేలా ఉండన ట్టుగా.. టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు కూడా అలానే ఉన్నారు;

ఏపీలో ఎమ్మెల్యేల తీరు ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉండడం గమనార్హం. అన్ని వేళ్లూ ఒకేలా ఉండన ట్టుగా.. టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు కూడా అలానే ఉన్నారు. కొన్నినియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఇష్టాను సారంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వివాదాలకు వారు కేరాఫ్‌గా మారుతున్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలిక పూడి శ్రీనివాసరావు ఈ జాబితాలో ముందున్నారు. ఈ వరుసలోనే నరసరావుపేట ఎమ్మెల్యే చదల వాడ అరవిందబాబు కూడా చేరిపోయారు.
ఇక, మరికొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పైకి శాంత స్వభావులుగా ఉన్నా.. చాపకింద నీరులా సొమ్ము లు పోగేసుకుంటున్నారు. వీరిని ప్రశ్నించే నాయకులు కూడా లేకపోవడం గమనార్హం. ఎవరైనా ప్రశ్నిస్తే.. వారికి కూడా అంతో ఇంతో ముట్టజెప్పి.. దారిలోకి తెచ్చుకుంటున్నారు. ఈ జాబితాలో విజయవాడ కు చెందిన ఓ ఎమ్మెల్యే పేరు జోరుగా వినిపిస్తోంది. ఇక, అనంతపురం నేతల విషయానికి వస్తే.. ఆధిపత్య రాజకీయాలకు పెద్దపీట వేస్తున్నారు.
నియోజకవర్గాల్లో తమ మాటే చెల్లుబాటు కావాలని చాలా మంది నేతలు తపిస్తున్నారు. దీంతో వారి కారణంగా నిరంతరం.. నియోజకవర్గాల్లో అధికార-విపక్ష నాయకుల మధ్య, అధికార-అధికార నాయకుల మధ్య కూడా రగడ తెరమీదికి వస్తోంది. ఇదిలావుంటే.. ఒకరిద్దరు ఎమ్మెల్యేల తీరు మరింత భిన్నంగా ఉంది. వారు తినరు.. ఎవరినీ తిననివ్వరు.. అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇది మంచి పరిణామమే అయినప్పటికీ.. ఎక్కడో తేడా కొట్టి.. ఎమ్మెల్యేలు రోడ్డున పడుతున్నారు.
కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి ఈ జాబితాలోకే వస్తున్నారు. కానీ, ఆమెకు అధికారులు ఎవరూ సహకరించడం లేదని తెలుస్తోంది. అవినీతి ఎవరు చేసినా ఊరుకునేది లేదని మాధవీ రెడ్డి చెబుతున్నారు. దీంతో అధి కార పార్టీకే చెందిన కొందరు నేతల ప్రాజెక్టులు అనుమతులకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. ఇక, గతంలో ఫైర్‌బ్రాండ్ ముద్ర వేసుకున్న చింతమనేని ప్రభాకర్ వంటివారు.. ఇప్పుడు ప్రజలకు చేరువ అవుతున్నారు. ఇలా.. ఎమ్మెల్యేల తీరు.. వ్యవహార శైలి కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉండడం గమనార్హం.