ఏకలవ్యుడి పేరు చెప్పి విద్యార్థిని వద్ద టీచర్ తప్పుడు ప్రతిపాదన!
ఏకలవ్యుడి ప్రేరణతో ఓ విద్యార్థినిని తనకు గర్ల్ ఫ్రెండ్ గా ఉండమంటూ ప్రపోజ్ చేశాడు ఓ ఉపాధ్యాయుడు.
మహాభారతంలోని ఏకలవ్యుడి కథ గురించి దాదాపు అందరికీ తెలిసిందే! అక్కడ విలుకాడైన ఏకలవ్యుడు గురువు ద్రోణాచార్యుడిని సంతోషపెట్టడానికి తన బొటనవేలును త్యాగం చేశాడు. సరిగ్గా ఇదే ఉదాహరణ గుర్తు చేస్తూ, ఏకలవ్యుడి ప్రేరణతో ఓ విద్యార్థినిని తనకు గర్ల్ ఫ్రెండ్ గా ఉండమంటూ ప్రపోజ్ చేశాడు ఓ ఉపాధ్యాయుడు.
అవును... వాలంటైన్స్ డే రోజున ఓ దారుణమైన విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... హైస్కూల్ లోని ఓ ఉపాధ్యాయుడు మహభారతంలోని ఏకలవ్యుడిని ప్రేరణగా చూపిస్తూ ఒక విద్యార్థిని తన స్నేహితురాలు కావాలని కోరినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో.. ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.. చర్యలకు డిమాండ్ చేస్తోంది!
వివరాళ్లోకి వెళ్తే... బీహార్ లోని కిషన్ గంజ్ జిల్లాలోని కిసాన్ హైస్కూల్ లో వికాస్ కుమార్ అనే ఉపాధ్యాయుడు వాలంటైన్స్ డే రోజు 12వ తరగతి చదువుతున్న విద్యార్థినికి.. ఏకలవ్యుడిని ఉదహరిస్తూ తనకు స్నేహితురాలిగా ఉండాలని కోరాడని చెబుతున్నారు. ఇతడు గతంలోనూ పలుమార్లు ఆమెకు ఫోన్ చేసి వేధించినట్లు చెబుతున్నారు.
ఇదే సమయంలో.. సిలిగురికి వెళ్లాలని కూడా ఆమెకు పలుమార్లు ప్రతిపాదించాడని తెలుస్తోంది. ఈ సమయంలో.. ఆ విద్యార్థిని ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి పోలీస్ కేసు నమోదు కాలేదని చెబుతున్నారు. మరోపక్క ఈ విషయాన్ని విద్యాశాఖకు అప్పగించగా.. వారు వికాస్ నుంచి వివరణ మాత్రమే కోరారని అంటున్నారు.
మరోపక్క... వికాస్ కుమార్ గతంలో ఓ మహిళా సహోద్యోగి పట్ల ఇలాంటి ప్రవర్తన చూపించాడని.. ఆ తర్వాత ఆమెనే వివాహం చేసుకున్నాడని చెబుతున్నారు. అతడు ఇప్పటికీ ఓ ప్రైవేటు స్కూల్ లో మెట్రిక్యులేషన్ పరీక్షకు ఇన్విజిలేటర్ గా పని చేస్తున్నాడని అంటున్నారు. ఇతడిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం గురించి అడిగినప్పుడు... దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు జిల్లా మెజిస్ట్రేట్ చెప్పారని చెబుతున్నారు. విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారని అంటున్నారు. మరోపక్క.. అతడిపై చర్యలు ఇంకా తీసుకోకపోవడంతో గ్రామస్థాలు స్కూలు ముందు ధర్నాకు దిగారని తెలుస్తోంది.