లౌక్యం తెలియ‌ని రాజ‌కీయం.. జ‌గ‌న్ ఒక క్వ‌శ్చ‌న్ మార్క్‌..!

ఇదీ నేటి రాజ‌కీయం. కేంద్రం నుంచి రాష్ట్రాల వ‌ర‌కు.. అన్నిప్ర‌భుత్వాల ప‌రిస్థితి కూడా ఇలానే ఉంది. ఈ లౌక్యానికి ఎవ‌రూ అతీతులు కారు.

Update: 2024-10-19 04:19 GMT

రాజ‌కీయాలన్నాక‌.. స్ట‌యిల్ మార్చాలి. పాలిటిక్స్ అన్నాక‌.. ప‌ట్టు విడుపులు కూడా ఉండాలి. మ‌రీ ము ఖ్యంగా ప్ర‌జ‌ల‌ను మెప్పించేందుకు.. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు లౌక్యం చాలా అవ‌స‌రం. ముఖ్యం కూడా. ``ఏం చెప్పార‌న్న‌ది కాదు.. ఎలాంటి హామీలు ఇచ్చార‌న్న‌ది కాదు.. అధికారంలోకి వ‌చ్చా రా? లేదా? అన్న‌దే ముఖ్యం`` - ఇదీ నేటి రాజ‌కీయం. కేంద్రం నుంచి రాష్ట్రాల వ‌ర‌కు.. అన్నిప్ర‌భుత్వాల ప‌రిస్థితి కూడా ఇలానే ఉంది. ఈ లౌక్యానికి ఎవ‌రూ అతీతులు కారు.

రాజ‌కీయాల్లో అన్నీచెప్పిన‌ట్టు జ‌ర‌గ‌వు! ఇది కామ‌న్ ఫ్యాక్ట‌ర్‌. కానీ, వైసీపీ అధినేత‌, మాజీసీఎం జ‌గ‌న్ ఈ విష‌యాన్ని తెలుసుకోలేక పోతున్నారు. ఇంకా తాను ప‌ట్టిన కుందేటికి మూడు కాళ్లే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రి స్తున్నారు. ``నేను అబ‌ద్ధాలు చెప్ప‌ను. అవ‌స‌ర‌మైతే.. మ‌ళ్లీ ఓడిపోతా. ఇంకా ప్ర‌తిప‌క్షంలోనే కూర్చుంటా`` అని జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు.. ఆయ‌నో క్వ‌శ్చ‌న్ మార్క్‌.. ఎవ‌రికీ అర్ధం కాడు! అన్న మాట‌ను మ‌రోసారి నిరూపిస్తోంది. రాజ‌కీయాల‌లో అబ‌ద్ధాలు ఉంటాయ‌ని.. జ‌గ‌న్ ఎలా అనుకుంటున్నారోఆయ‌న‌కే తెలియా లి.

అస‌లు రాజ‌కీయాల్లో ఉండేది `లౌక్యం` మాత్ర‌మే. నిజం-అబద్ధం అనే ప‌దాలు రాజ‌కీయ నిఘంటువులో ఉండ‌నే ఉండ‌వు. అవ‌స‌రం-అవ‌కాశం అనే రెండు ప‌ట్టాల‌పై ప్ర‌యాణించే రాజ‌కీయ రైలు.. లౌక్యంగానే ముందుకు సాగుతుంది త‌ప్ప‌.. `అబ‌ద్ధాలు-నిజాలు` అనే సిగ్న‌ళ్లు వేసుకుని.. త‌న‌ను తాను నియంత్రించు కునే ప్ర‌య‌త్నం చేయ‌దు. ఈ విష‌యాన్ని జ‌గ‌న్ గ్ర‌హించాలి. ఓకే.. ఒక వేళ‌.. ఆయ‌న చెబుతున్న‌ట్టు చంద్ర‌బాబు అలివికాని హామీలు ఇచ్చార‌ని... ఇవ‌న్నీ అబ‌ద్ధాల‌ని అనుకుందాం. మ‌రి 2019-24 మ‌ధ్య జ‌గ‌న్ చేసింది కూడా `అబ‌ద్ధాల` రాజ‌కీయ‌మే క‌దా!

మ‌ద్య నిషేధం చేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఏటా మ‌ద్యం షాపుల‌ను త‌గ్గిస్తామ‌న్నారు. ఈ రెండు విష‌యాల ను చూస్తే.. మ‌ద్యాన్ని తాగ‌కుండా.. నియంత్రించ‌డం అనేది ప్ర‌భుత్వం చేతిలో లేద‌ని అనుకుందాం. ఎందుకంటే తాగేవాడు ఏదో ఒక రూపంలో ఎక్క‌డోచోట నుంచి తెచ్చుకుని తాగుతాడు. దీనిని చంద్ర‌బాబై నా.. ప‌వ‌నైనా.. జ‌గ‌నైనా మాన్పించ‌లేరు. కానీ, జ‌గ‌నే చెప్పిన‌ట్టు.. మ‌ద్యం షాపుల‌ను త‌గ్గించ‌వ‌చ్చుక‌దా? పైగా షాపుల‌న్నీ.. స‌ర్కారు చేతిలోనే ఉన్నాయి.

కానీ.. ఆయ‌న తొలి ఏడాది 22 శాతం షాపులు త‌గ్గించారు. ఆ త‌ర్వాత నాలుగేళ్లు వ‌దిలేశారు. మ‌రి దీనిని బ‌ట్టి ఆయ‌న ఇచ్చిన ఎన్నిక‌ల హామీని అబ‌ద్ధం అనుకోవా లి! ఇక‌, 22 మంది ఎంపీలు ఉన్నా.. హోదా తీసుకురాలేక పోయారు.. దీనిని కూడా అబ‌ద్ధ‌మ‌నే అనుకోవాలి. ఇది జ‌గ‌న్ కాన్సెప్టులో చూస్తే.. అలానే అనిపిస్తుంది. కానీ, రాజ‌కీయ కోణంలో చూస్తే.. లౌక్య‌మ‌నే అనాలి. కాబ‌ట్టి.. ఇప్ప‌టికైనా.. జ‌గ‌న్ లౌక్యంగా అడుగులు వేయాలి. ఏది ఎప్ప‌టికి అవ‌స‌ర‌మో.. అప్ప‌టికి మాట్లాడి.. అధికారం ద‌క్కించుకునేలా ఉండాలే త‌ప్ప‌.. మ‌డి క‌ట్టుకుని కూర్చుంటానంటే.. పార్టీకే న‌ష్టం!!

Tags:    

Similar News