కాకినాడ పోర్టు.. సెజ్ ను అలా లాగేసుకున్నారు.. షాకింగ్ కంప్లైంట్ బయటకు!

అందులో నిజానిజాల్ని సీఐడీ తేల్చాల్సి ఉంది. ఇంతకూ కేవీ రావు ఏమేం ఆరోపణలు చేశారు? అన్నది చూస్తే..

Update: 2024-12-04 05:33 GMT

కొన్ని దారుణ నేరాలకు సంబంధించి తరచి చూసినప్పుడు ఆసక్తికర అంశం ఒకటి కనిపిస్తుంది. సినిమాల్ని చూసి నేరస్తులు స్ఫూర్తి పొందుతారా? లేదంటే రియల్ ప్రపంచంలో కొందరి అరాచకాల్ని స్ఫూర్తిగా తీసుకొని రీల్ క్యారెక్టర్లను క్రియేట్ చేస్తారా? అన్నది ప్రశ్నగా మారటం తెలిసిందే. తాజా ఉదంతం గురించి తెలిస్తే మాత్రం ఇలాంటి ఫీలింగ్ ఖాయంగా కలుగుతుంది.

కాకినాడ పోర్టు యజమానుల్లో ఒకరు.. కాకినాడ పోర్టు.. కాకినాడ సెజ్ ల్లో తమకున్న వాటాను అక్రమంగా తమ నుంచి లాగేసుకున్నారని.. రూ.2500 కోట్ల వాటాను కేవలం రూ.494 కోట్లకు లాక్కున్నట్లుగా గతంలో వాటి యజమానిగా వ్యవహరించిన కేవీ రావు అలియాస్ కర్నాటి వెంకటేశ్వరరావు తాజాగా సీఐడీకి ఫిర్యాదు చేశారు.

కాకినాడ పోర్టును.. సెజ్ ను తమను బెదిరించి.. భయపెట్టి మరీ తమ నుంచి లాగేసుకున్నట్లుగా పేర్కొన్నారు. ఆయన సీఐడీకి తాజాగా ఇచ్చిన పది పేజీల కంప్లైంట్ లో సంచలన అంశాల్నిప్రస్తావించారు.

అందులో నిజానిజాల్ని సీఐడీ తేల్చాల్సి ఉంది. ఇంతకూ కేవీ రావు ఏమేం ఆరోపణలు చేశారు? అన్నది చూస్తే..

- రూ.2500 కోట్ల వాటాను రూ.494 కోట్లకు లాక్కున్నారు. సెజ్ లో నా వాటా విలువ రూ.1109 కోట్లు. దానిని కేవలం రూ.12 కోట్లకు లాగేసుకున్నారు.

- నిజాయితీగా వ్యాపారం చేశాం. ప్రభుత్వానికి రూపాయి పన్ను ఎగ్గొట్టలేదు. అయినా తీరని అన్యాయం చేశారు. వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి చెప్పినట్లుగా చేయాలని చెప్పారు. కనీసం మా మాటల్ని కూడా వినలేదు.

- 1999లో అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వంతో మేం ఒప్పందం చేసుకున్నాం. దీని ప్రకారం కాకినాడ పోర్టును డెవలప్ చేశాం. జీఎంఆర్ తో కలిసి కాకినాడ సెజ్ ను ఏర్పాటు చేశాం. దీని కోసం కాకినాడ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు చేశాం. మా కంపెనీ ఆదాయంలో 22 శాతం ప్రభుత్వానికి చెల్లించేలా అప్పట్లో ఒప్పందం కుదిరింది.

- 2019 మొదటి వరకు బాగానే జరిగింది. ఆ తర్వాతే ఇబ్బందులు మొదలయ్యాయి. చెన్నైకు చెందిన శ్రీధర్ అండ్ సంతానం కంపెనీతో ప్రత్యేక ఆడిట్ నిర్వహిస్తున్నట్లుగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ముంబయికి చెందిన మరో సంస్థతోనూ ఆడిట్ అంటూ సమాచారం ఇచ్చారు. రెండు సంస్థలకు మేం సహకారాన్ని అందించాం.

- ఆడిట్ సంస్థలకు మా రికార్డులన్నింటిని ముందు ఉంచాం. కానీ.. మా సంస్థ ప్రభుత్వానికి రూ.994 కోట్లు ఎగ్గొట్టినట్లుగా రిపోర్టులు ఇచ్చాయి. ఈ సమయంలోనే మాకు విజయసాయి రెడ్డి ఫోన్ చేశారు. వైవీ సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డిని కలవాలని చెప్పారు.

- హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉన్న విక్రాంత్ రెడ్డి ఇంటికి వెళ్లాం. మేం 1999 నుంచి వ్యాపారం చేస్తున్నామని చెప్పినా వినిపించుకోలేదు. ప్రభుత్వానికి వెయ్యి కోట్లు ఎగ్గొట్టారు. మొత్తం ఫ్యామిలీని జైలుకు పంపుతాం. అలా కాకుండా ఉండాలంటే మీ కంపెనీ షేర్లను మాకు అమ్మేయండి అంటూ చెప్పారు.

- దిక్కుతోచని స్థితిలో భయంతో మా కంపెనీ షేర్లను అమ్మేందుకు ఒప్పుకున్నాం. అయితే.. షేర్ విలువ చెప్పలేదు. మర్చంట్ బ్యాంకర్ ను సీన్లోకి తీసుకొచ్చి షేర్ విలువ తేలుస్తామన్నారు. రూ.100 కోట్లు అడ్వాన్సుగా ఇస్తున్నట్లుగా అగ్రిమెంట్ మీద సంతకాలు చేయించుకున్నారు.

- ఆ తర్వాత పిలిచి.. మా వాటా కింద ఉనన షేర్లలో 41.14 శాతం వాటాకు రూ.494 కోట్లు ఖరారు చేశామని.. డీల్ సెట్ చేసుకోవాలని కోరారు. ఒక్క ఏడాదిలోనే రూ.170 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన కంపెనీ షేర్లకు ఇంత తక్కువ విలువ కడతారా? అన్నా వినిపించుకోలేదు. బెజవాడ బెంజ్ సర్కిల్ లో స్థిరాసతిని ప్రభుత్వ విలువ కంటే తక్కువగా లాక్కున్నారు.

- కాకినాడ సెజ్ ను మేము.. జీఎంఆర్ కలిపి 1999లో డెవలప్ చేశాం. అందులో 48.74 శాతం మా ఫ్యామిలీ వాటా. మిగిలింది జీఎంఆర్ వాటా. మా వాటాలో 8వేల ఎకరాల భూమి.. పోర్టులో షేర్ ఉన్నాయి. అప్పటి ప్రభుత్వం నుంచి ఇబ్బందులు పడలేమని మా మొత్తం భూమిని.. వాటాను రూ.400 కోట్లకు జీఎంఆర్ కు ఇచ్చేయాలని భావించాం.

- నిజానికి దాని విలువ రూ.1104 కోట్లు అయినప్పటికి మా పార్టనర్ అయిన జీఎంఆర్ కు ఇచ్చేయాలని అగ్రిమెంట్ చేసుకున్నాం. కానీ.. జీఎంఆర్ తో డీల్ రద్దు చేసుకొని అంతా తమకే కట్టబెట్టాలని అరబిందో యాజమాన్యం వార్నింగ్ ఇచ్చింది. తేడా జరిగితే జైలుకే అని హెచ్చరించింది. రూ12 కోట్లు ఇచ్చి కాకినాడ సెజ్ లో ఉన్న మా వాటా (48.74 శాతం)ను దక్కించుకున్నారు.

Tags:    

Similar News