భర్తను చంపి బాడీతో ప్రియుడి బైక్ పై రైడ్... షాకింగ్ వీడియో!
ఈ క్రమంలో తాజాగా.. భర్తను చంపి, అతడి డెడ్ బాడీని, ప్రియుడితో బైక్ పై తీసుకెళ్తున్న భార్య వీడియో తెరపైకి వచ్చింది.;
ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ లో మాజీ మర్చంట్ నేవీ అధికారిని.. అతని భార్య, ప్రియుడు కలిసి కౄరంగా హత్యచేసి, ముక్కలు చేసి, డ్రమ్ముల్లో పూడ్చి పెట్టిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన షాకింగ్ విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా.. భర్తను చంపి, అతడి డెడ్ బాడీని, ప్రియుడితో బైక్ పై తీసుకెళ్తున్న భార్య వీడియో తెరపైకి వచ్చింది.
అవును... ప్రియుడితో కలిసి భర్తలను తుదమిట్టిస్తోన్న భార్యల సంఖ్య ఇటీవల పెరుగుతోన్న సంగతి తెలిసిందే! తాజాగా హల్ చల్ చేస్తోన్న మీరట్ లో మాజీ మర్చంట్ నేవీ అధికారి హత్య కేసు ఇందుకు తాజా ఉదాహరణ కాగా.. తాజాగా భర్తను చంపి, సాక్ష్యాలను దాచడానికి అతని శరీరాన్ని తగలబెట్టిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ వ్యవహారం తెరపైకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజస్థాన్ లోని జైపూర్ లో ధన్నాలాల్ సైని, గోపాలి దేవి అనే దంపతులు ఉన్నారు. ఈ క్రమంలో గోపాలి దేవికి దీన్ దయాల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది! ఈ విషయం గ్రహించిన ధన్నాలాల్ సైని... తన భార్యను నిలదీశాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్యా పెద్ద గొడవే జరిగింది!
ఈ సమయంలో... విషయం ఘర్షణకు దారితీయడంతో గోపాలి దేవి, ఆమె ప్రియుడు దీన్ దయాల్ కలిసి ఇనుప రాడ్ తో ధన్నాలాల్ తలపై బలంగా బాదారు. దీంతో.. అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో... భర్త శవాన్ని ప్యాక్ చేసి ఒళ్లో పెట్టుకుని గోపాలి దేవి వెనుక కూర్చోగా.. ప్రియుడు బైక్ రైడ్ చేశాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో దర్శనమిచ్చాయి!
కట్ చేస్తే... మార్చి 16న ఓ ప్రధాన రహదారి దగ్గర సగం కాలిన మృతదేహం ఉందనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో... అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సమయంలో... బాధితుడిని హత్య చేసి, ఆధారాలు మాయం చేసేందుకు మృతదేహాన్ని కాల్చినట్లు సందేహించారు.
ఈ సమయంలో రెండు రోజుల తర్వాత మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.. ఈ సమయంలో గోపాలిదేవి, దీన్ దయాల్ లను అరెస్ట్ చేశారు. ఈ విషయాలను డీసీపీ సౌత్ దిగంత్ ఆనంద్ ధృవీకరించారు. ఈ విషయం సంచలనంగా మారింది.