టార్గెట్ షర్మిళ... సజ్జల సంచలన వ్యాఖ్యలు!

ఈ క్రమంలో తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సజ్జల రామకృష్ణారెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిళపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-03-21 14:49 GMT

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రసవత్తర రాజకీయం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రోజుకో కీలక పరిణామం తెరపైకి వస్తుండగా.. మరోపక్క విమర్శలు ప్రతివిమర్శలతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతుంది. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సజ్జల రామకృష్ణారెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిళపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయం రోజు రోజుకీ వేడెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సీనియర్ జర్నలిస్టు విజయబాబు రచించిన "మహా దోపిడీ" పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సజ్జల రామకృష్ణారెడ్డి.. అటు చంద్రబాబు, ఇటు వైఎస్ షర్మిలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... చంద్రబాబు వ్యవస్థలను ఎలా మేనేజ్ చేశారో స్పష్టంగా ఈ పుస్తకంలో తెలిపారని అన్నారు.

ఇదే క్రమంలో... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులను చంద్రబాబు ఎలా దోచేశారో క్లియర్ గా ఈ పుస్తకంలో తెలిపారని చెప్పిన సజ్జల.. రాజకీయమంటే దోపిడీ అన్నట్లుగానే చంద్రబాబు తన రాజకీయ జీవితమంతా వ్యవహరించారని ఆరోపించారు. ఈ క్రమంలోనే తన రాజకీయ ప్రయోజనాలకోసం పవన్ కల్యాణ్, బీజేపీలను వాడుకుంటున్నారని అన్నారు. అనంతరం ఏపీ పీసీసీ చీఫ్ షర్మిళపైనా సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... వైఎస్ షర్మిళ మాట్లాడే భాషను ప్రజలు గమనిస్తున్నారని చెప్పిన సజ్జల... ఆమె మాట్లాడే స్క్రిప్ట్ మొత్తం చంద్రబాబు వద్ద నుంచే వస్తుందని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని, దేనికైనా సిద్ధపడతారని సజ్జల కామెంట్ చేశారు. అవినీతిని పరాకాష్టకు చేరినందుకు 2019 ఎన్నికల్లో చంద్రబాబుని ఘోరంగా ఓడించారని అన్నారు. అమరావతి స్కాం లాంటిదే ఐఎంజీ స్కాం కూడా అని తెలిపారు.

ఇదే క్రమంలో... ఐఎంజీ భారత్ పేరుతో చేసిన స్కాం.. ఇంటర్నేషనల్ క్లాసిక్ స్కాం అని తెలంగాణ హైకోర్టు సైతం అభిప్రాయపడిందని చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి... లక్ష రూపాయల పెట్టుబడితో వచ్చిన కంపెనీకి కేవలం ఐదురోజుల్లోనే సుమారు 400 ఎకరాలను కేటాయించారని ఫైరయ్యారు! అంతక ముందు కుప్పంలో ఇజ్రాయేల్ సాగు పేరుతోనూ స్కాం చేశారని అన్నారు. ఇక నీరు - చెట్టు పేరుతో చేసిన దోపిడీ ఇంకో ఎత్తని తెలిపారు.

Tags:    

Similar News