పాక్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే... ఇదే తాజా ఉదా!
డాలర్ తో పోలిస్తే పాక్ రూపీ మారకం విలువ దారుణంగా పతనం అయిపోవడంతో ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని అంటున్నారు.
పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి సుమారు గత రెండేళ్లుగా అత్యంత దయణీయంగా ఉందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ కోడి గుడ్డు ధరల నుంచి ఇంధనం ధరల వరకూ పరిస్థితి దారుణంగా ఉందని అంటున్నారు. డాలర్ తో పోలిస్తే పాక్ రూపీ మారకం విలువ దారుణంగా పతనం అయిపోవడంతో ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని అంటున్నారు.
ప్రధానంగా గత కొంతకాలంగా నిత్యావసర సరుకుల ధరలు పతాక స్థాయికి చేరడానికి తోడు.. ఇటీవల వచ్చిన వరదలతో గోదుమ పంట తీవ్రంగా పోయిందని చెబుతున్నారు. ఇది మూలిగే నక్క మీద తాటికాయ చందంలా మారిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇతర ఇస్లామిక్ దేశాలకు పాక్ నుంచి సరికొత్త సమస్య వచ్చిందని అంటున్నారు. అదే.. బిచ్చగాళ్ల బెడద!
అవును... ప్రస్తుతం పాకిస్థాన్ లో బ్రతకటం అత్యంత క్లిష్టతరంగ మారిపోయిందని.. ఇరవై ముప్పై రూపాయలు పెడితే కానీ ఓ గుడ్డు దొరకడం లేదని చెబుతున్నారు. ఈ సమయంలో ముస్లిం మత పవిత్ర ప్రదేశాలను దర్శించడానికి అనే సాకుతో పాకిస్థాన్ నుంచి చాలా మంది ఇస్లామిక్ దేశాలకు వెళ్లిపోతున్నారంట. ఇలా వెళ్లినవారు చాలా మంది బిక్షాటన మొదలుపెట్టారని అంటున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్థాన్ లో సాధారణ పౌరులుగా జీవించడం కంటే.. ఈ దేశాల్లో బిక్షగాళ్లుగా జీవించడమే బెటరనే ఆలోచనకు వారంతా వచ్చేశారని అంటున్నారు. పరిస్థితి మరీ ముదిరిపోతుండటంతో.. ఇటీవల పాక్ దౌత్యవేత్తలకు ఇతర ఇస్లామిక్ దేశాల నుంచి ఈ విషయంలో పలు హెచ్చరికలు అందాయని అంటున్నారు.
ఇందులో భాగంగా... బిచ్చగాళ్లను కంట్రోల్ చేయండి అంటు పాకిస్థాన్ కు ఇటీవల సౌదీ అరేబియా గట్టిగానే హెచ్చరికలు జారీ చేసిందని అంటున్నారు. మక్కా యాత్ర పేరు చెప్పి వీసాలకు అప్లై చేసుకుని.. పాక్ నుంచి వచ్చి తిరిగి వెళ్లకుండా ఇక్కడే బెగ్గింగ్ చేసుకుంటున్నారని వెల్లడించినట్లు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో అక్కడి బిచ్చగాళ్లను గుర్తించి, వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. వారిలో సుమారు 90% మంది పాకీస్థానీయులే అని తేలిందని అంటున్నారు. వీరంతా హజ్ యాత్ర పేరు చెప్పి సౌదీ చేరుకున్నట్లు చెబుతున్నారు. ఈ విషయంలో యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ (యూఏఈ) కూడా వీరి భారిన పడినట్లు చెబుతున్నారు. వీరిలో కొంతమంది ఇరాన్ వరకూ కూడా వెళ్తున్నారని అంటున్నారు.
ఏది ఏమైనా.. పక్క దేశాలకు ఉగ్రవాదులను ఎగుమతీ చేస్తుందనే పేరున్న పాకిస్థాన్ తాజాగా బిచ్చగాళ్లను కూడా విదేశాలకు పంపిస్తుందనే కామెంట్లు ఈ నేపథ్యంలో వినిపిస్తున్నాయి. మరి పాక్ వారిని కంట్రోల్ చేస్తుందా.. ఇతర ఇస్లామిక్ దేశాల ఆగ్రహాన్ని చవి చూస్తుందా అనేది వేచి చూడాలి.