వైసీపీ... బీయారెస్ కి ఏమీ గిఫ్ట్ ఇవ్వదా...?
ఆయన 2018 ఎన్నికలలో గెలిచిన తరువాత నిర్వహించిన తొలి ప్రెస్ మీట్ లోనే అనాటి ఏపీ సీఎం చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ని తప్పకుండా ఇచ్చి తీరుతామని చెప్పారు.
రాజకీయాల్లో గిఫ్టులు రిటర్న్ గిఫ్టులు పడికట్టు భాషగా మారిపోయి చాలాకాలమే అవుతోంది. నిజం చెప్పాలీ అంటే రిటర్న్ గిఫ్ట్ అన్న దాన్ని బాగా పాపులర్ చేసిన వారు కేసీయార్. ఆయన 2018 ఎన్నికలలో గెలిచిన తరువాత నిర్వహించిన తొలి ప్రెస్ మీట్ లోనే అనాటి ఏపీ సీఎం చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ని తప్పకుండా ఇచ్చి తీరుతామని చెప్పారు.
అలాగే ఆయన చంద్రబాబు ఓటమి కోసం 2019 ఎన్నికల్లో చాలానే కృషి చేశారు. ఆ విధంగా బాబుకు రిటర్న్ గిఫ్ట్ బాగానే ఆందినట్లు అయింది అని రాజకీయ వర్గాలలో చర్చించుకున్నారు. ఇదంతా ఎందుకు వచ్చింది అంటే చంద్రబాబు 2018 ఎన్నికల్లో ఒక వైపు కాంగ్రెస్ మరో వైపు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని మరీ నాటి టీయారెస్ ప్రభుత్వాన్ని బాగా ఇరకాటంలోకి నెట్టారు.
ఒక దశలో ఈ కూటమి చేసిన ప్రచారానికి రాజకీయ దూకుడుకు ఉక్కిరిబిక్కిరి అయిపోయారు కేసీయార్. ఆ తరువాత ఆయన చాలా తెలివిగా ఒడుపుగా తెలంగాణా సెంటిమెంట్ ని రగిలించారు. అది కరెక్ట్ టైంలో అంటుకుంది. దాంతో కూటమి విజయావకాశాలు మటాష్ కాగా టీయారెస్ బంపర్ విక్టరీ కొట్టింది. అయితే నాడు తనను నానా ఇబ్బందులు పెట్టిన బాబుని ఏపీలో అధికారంలో లేకుండా చేయాలని కేసీయార్ వేసిన ఎత్తుగడలు ఫలించాలి. జగన్ ఏపీకి సీఎం అయ్యారు.
ఇపుడు చూస్తే కేసీయార్ మళ్ళీ ఎన్నికల రణ క్షేత్రాన నిలబడి ఉన్నారు. ఈసారి టీడీపీ కూడా తన స్ట్రాటజీ మార్చేసింది. డైరెక్ట్ గా పోటీ పడకుండా ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వాలని టీడీపీ డిసైడ్ అయింది ప్రచారం అయితే సాగుతోంది. దాంతో టీడీపీని బయటకు విమర్శించే అవకాశం అయితే బీయారెస్ కి ఎక్కడా దొరకడంలేదు. పైగా చంద్రబాబుని పొగడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి.
ఎందుకంటే ఎవరికీ టీడీపీ తమ మద్దతు అని ఓపెన్ గా చెప్పడం లేదు. దాంతో టీడీపీ ఓట్లు ఎంతో కొంత తమ వైపు టర్న్ చేసుకోవాలని బీయారెస్ చూస్తోంది. అయితే 2018 నాటి రిటర్న్ గిఫ్ట్ అందుకున్న టీడీపీ ఇపుడు సైలెంట్ గా కేసీయార్ కి అదే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతోంది అని అంటున్నారు. మరి నాడు బాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి జగన్ కి ఎంతో కొంత మేలు చేసిన కేసీయార్ కి బీయారెస్ కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వదా అన్న చర్చ అయితే వస్తోంది.
తెలంగాణాలో టీడీపీ పాత్ర ఎనటో ఒక ప్రచారంగా ఉంది. అది ఎంతవరకూ కరెక్ట్ అన్నది ఫలితాలు వచ్చిన తరువాతనే తెలుస్తుంది. మరి ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ బీయారెస్ కి గిఫ్ట్ ఏమైనా ఇస్తుందా అన్నదే చర్చ. అంటే వైసీపీ నుంచి బీయారెస్ కి ఇండైరెక్ట్ గా అయినా హెల్ప్ జరుగుతుందా అన్నదే ఆ చర్చ.
అయితే గడచిన ఎన్నికల్లో కూడా వైఎస్సార్ అభిమానులు వైసీపీ అభిమానులు బీయారెస్ కే సపోర్ట్ చేశారు అని ప్రచారం జరిగింది. ఈసారి కూడా అలాగే జరుగుతుంది అని అంటున్న వారూ ఉన్నారు. మరో వైపు చూస్తే వైసీపీ హై లెవెల్ లో ఏమైనా వ్యూహరచన చేస్తోందా అన్నదే హాట్ టాపిక్ గా ఉంది.
ఇక తెలంగాణా ప్రజలు ఎవరికి గిఫ్ట్ ఇస్తారు అన్నది కూడా చర్చకు వస్తున్న విషయం. వారు ఇచ్చే గిఫ్ట్ కాంగ్రెస్ కి దక్కుతుందా లేక బీయారెస్ కే అందుతుందా అన్నది కూడా చూడాలని అంటున్నారు. ఈసారి ఎన్నికలు అంచనాలకు అందకుండా ఉన్నాయి. సర్వేలు ఎన్ని చెప్పినా జనాల పూర్తి నాడిని అయితే ఈవీఎం మిషన్లు తప్ప ఎవరూ పట్టుకోలేరని అంటున్నారు. దాంతో పాటు వివిధ పార్టీల రాజకీయ వ్యూహాలు కూడా ఇపుడు తెలంగాణా ఎన్నికల మీద ఎంత మేరకు ప్రభావం చూపిస్తాయన్నది కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు.