ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఏకంగా శనివారం కేసుల సంఖ్య 1000 దాటింది. గడిచిన 24 గంటల్లోనే ఏపీలో కొత్తగా 61 పాజిటివ్ కేసులు వెలుగుచూసినట్లు శనివారం ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1016కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 814గా ఉన్నాయి.
కొత్త కేసుల్లో కృష్ణా జిల్లాలో 25, కర్నూలులో 14 - అనంతపురం 5 - కడప 4 - నెల్లూరు 4 - శ్రీకాకుళంలో 3 - గుంటూరులో 3 - తూ. గోదావరి 3 కేసులు నమోదయ్యాయి. కర్నూలులో రాష్ట్రంలోనే అత్యధికంగా 275 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత గుంటూరు 209తో రెండో స్థానంలో ఉంది. ఇప్పటివరకు కేసులు లేని శ్రీకాకుళంలో 3 కేసులు నమోదు కావడం సంచలనంగా మారింది. ఇక రాష్ట్రం మొత్తం మీద విజయనగరంలోనే ఒక్క కేసు కూడా లేదు. ఏపీలో ఇప్పటివరకు కరోనా తో 31మంది చనిపోయారు.
*తెలంగాణలో తగ్గిన కేసులు..
తెలంగాణలో కంటెయిన్ మెంట్ జోన్ల నుంచి తప్ప కొత్తగా ఇతర ప్రాంతాల నుంచి కరోనా పాజిటివ్ కేసులు లేవు. కేవలం 13 కేసులు మాత్రమే శుక్రవారం నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 983గా నమోదయ్యింది. మొత్తంగా తెలంగాణలో గత నాలుగు రోజుల నుంచి కొత్త కేసులు తగ్గుతున్నాయి. కరోనాతో మరణించిన వారి సంఖ్య 25కి చేరుకుంది.
*భారత దేశంలో..
ఇక భారత దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1400కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా కేసుల సంఖ్య 6817కు చేరింది. అత్యధికంగా ఒక్కరోజులో 18మంది మహారాష్ట్రలో చనిపోయారు. మొత్తం మృతుల సంఖ్య 300 దాటింది. ముంబైలో పరిస్థితి దారుణంగా ఉంది. దేశంలో చూస్తే పాజిటివ్ కేసుల్లో ముంబైలోనే 8శాతం ఉన్నాయి.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 24400కి చేరింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 780మంది మరణించారు.
* ప్రపంచవ్యాప్తంగా..
ప్రపంచవ్యాప్తంగా 28,30,082 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 1,97,246కి చేరింది. అయితే కరోనా నుంచి భారీ ఎత్తున కోలుకున్నారు. ఈ కేసుల సంఖ్య పెరగడం కాస్త ఊరటను ఇచ్చే విషయం. ఇప్పటి దాకా 798,776 మంది ఈ వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ఇక అమెరికాలో అయితే కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. అత్యధికంగా పాజిటివ్ కేసులు 9,25,038, మరణాలు 52,185 కూడా ఈ దేశంలోనే నమోదయ్యాయి.
స్పెయిన్ - ఇటలీ - ఫ్రాన్స్ - జర్మనీ - బ్రిటన్ - టర్కీ దేశాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. కాగా, కరోనా పుట్టినిల్లు చైనాలో కూడా మరోసారి వైరస్ ఛాయలు కనిపిస్తున్నాయి.