కరోనాని జయించిన 8 రోజుల శిశువు !

Update: 2021-04-29 10:37 GMT
ప్రపంచ వ్యాపంగా కరోనా వైరస్ కలకలం కొనసాగుతోంది. ముఖ్యంగా మన దేశంలో కరోనా కేసులు రోజురోజుకి ఊహించని విధంగా భారీగా పెరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా దాదాపుగా మూడు లక్షలకి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే దేశంలో  కరోనా మరణాలు కూడా అత్యధికంగానే ఉంటున్నాయి.  చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఈ వైర‌స్ అంటుకుంటోంది. ఈ నేపధ్యంలో యూపీలోని ఘజియాబాద్‌లో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఎంతోమంది దృడంగా ఉన్న వ్యక్తులే కరోనా మహమ్మారి ముందు ఓడిపోయి ప్రాణాలు వదిలేస్తే , ఉహ కూడా తెలియని రోజుల బిడ్డ కరోనా ను జయించి అందరిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు.  

 పూర్తి వివరాల్లోకి .. వెళ్తే ..    ఘజియాబాద్‌ లోని యశోద ఆసుపత్రిలో ఈ బాధిత శిశువును జాయిన్ చేశారు.  ఆ సమయంలో ఆ శిశువు శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. దీనితో వైద్యులు ఆ శిశువుకు వెంటనే చికిత్స చేశారు. ఫలితంగా ఆ శిశువు అనారోగ్యం నుంచి కోలుకున్నాడు. తరువాత ఆ శిశువుకు కరోనా వైరస్ పాజిటివ్ గా వచ్చినట్టు  వైద్య పరీక్షల్లో నిర్దారణ అయ్యింది. దీనితో ఆ తల్లిదండ్రులు ఏమౌతుందో అని చాలా బాధపడ్డారు. కానీ, కరోనా  చికిత్స తీసుకున్న ఆ  బాలుడు  ఎట్టకేలకి కరోనా పై విజయం సాధించి క్షేమంగా బయటకి వచ్చాడు. ఆ శిశువుకు నెగిటివ్ రిపోర్టు రావడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Tags:    

Similar News