కరాటే కళ్యాణి మర్డర్ కి ప్లాన్?

Update: 2023-06-06 09:06 GMT
సినీ నటిగా తెలుగు వారందరికీ పరిచయమైన కరాటే కళ్యాణి బిగ్ బాస్ ద్వారా మరింత ప్రజలకు చేరువయ్యారు. దాదాపు తన కెరియర్ లో 120 కి పైగా సినిమాల్లో నటించిన ఆమె... చత్రపతి, కృష్ణ, మిరపకాయ్ వంటి సినిమాలతో అయితే బాగా పాపులర్ అయింది.

అయితే ఈ మధ్య కాలంలో సినిమా అవకాశాలు రాకపోవడంతో బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఆమె హిందుత్వం అజెండాను తలెత్తుకుని ఎప్పటికప్పుడు హడావుడి చేస్తూ వస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న క్రమంలో ఆ విగ్రహం కృష్ణుడిని పోలి ఉందని తమ కుల దైవమైన కృష్ణుడిని కించ పరిచేలా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కరెక్ట్ కాదు అని చెబుతూ కోర్టుకు వెళ్లి విగ్రహం ఏర్పాటును కూడా ఆమె అడ్డుకున్నారు.

అలా చేయడం వల్ల ఆమె మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ కూడా అయింది. ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు సమాధానం చెప్పాలంటే ఆమెకు షోకాస్ నోటీసులు కూడా ఇచ్చారు. అయితే తాజాగా తనను చంపేందుకు ప్లాన్ చేశారని తనకు ప్రాణహాని ఉందని దాడి కూడా చేసేందుకు ప్రయత్నించారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని ఈ మధ్యనే తన కొత్త కారు రెండు టైర్లను గుర్తుతెలియని వ్యక్తులు కోసేసారని ఆమె ఆరోపించారు.

హిందుత్వం వాదులతో కలిసి కారులో వెళ్తున్నానని ఒక గుడి దగ్గర ఏదో గొడవ జరుగుతుంటే అక్కడికి వెళ్లి తిరిగి ఒక డొంక రోడ్ లో వస్తున్న సమయంలో కారు టైర్ పేలిపోయిందని వెల్లడించారు. డొంక రోడ్డు కాబట్టి నెమ్మదిగా వెళుతున్నాం పెద్ద ప్రమాదం ఏమి జరగలేదు. అదే హైవే మీద పేలిపోయి ఉంటే పెను ప్రమాదం జరిగి బతికి ఉండే దాన్నో లేదో చెప్పలేను అని ఆమె పేర్కొన్నారు. ప్రమాదం తర్వాత కారు టైరు చూసిన మెకానిక్ లు ఆ టైరును ఎవరో ముందే కోశారని చెప్పారని తన మీద కోపంతోనే ఎవరో ఇలా చేశారని ఆమె వెల్లడించారు.

అయితే ఈ గొడవకు టీడీపీకి సంబంధం లేదని రాజకీయమంతా ఖమ్మంలోనే జరుగుతుంది. కాబట్టి అక్కడ వ్యక్తులే ఏదైనా చేసి ఉండొచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేసింది.

Similar News