కర్ణాటకలో అధికారపక్ష భాగస్వామి అయిన కాంగ్రెస్ నిర్వహిస్తున్న ఎమ్మెల్యేల క్యాంప్ ముగిసింది. కమలనాథులు చేపట్టిన ఆపరేషన్ తో అలెర్ట్ అయిన కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను రిసార్ట్ కు తరలించి.. కట్టడి చేయటం తెలిసిందే. అయితే.. ఎమ్మెల్యేల రిసార్ట్ ఎపిసోడ్ లో ఇద్దరు నేతలు బాహాబాహీకి దిగటం.. కొట్టుకున్న వైనం బయటకు పొక్కి వివాదాస్పదంగా మారింది.
తోటి ఎమ్మెల్యేపై దాడి చేసిన ఎమ్మెల్యే గణేశ్ ను సస్పెన్షన్ వేటు వేస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోగా.. మరోవైపు ఆయనపై పోలీసులు హత్యయత్నం కేసును నమోదు చేశారు. బీజేపీ నేతలు ప్రలోభాలకు గురి చేస్తారన్న సమాచారంలో కాంగ్రెస్ అలెర్ట్ అయి.. బెంగళూరు శివారులోని ఈగల్ టన్ రిసార్టులో 70 మంది ఎమ్మెల్యేలతో క్యాంపును నిర్వహించారు.
ఎమ్మెల్యేలు ఇద్దరు కొట్టుకోవటంతో పరువు పోయిన కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అదే సమయంలో.. సిద్దగంగ మఠాధిపతి శివకుమారస్వామి కన్నుమూయటంతో క్యాంపు రాజకీయాలకు చెక్ చెప్పి.. ఎమ్మెల్యేలను ఇళ్లకు పంపాలన్న నిర్ణయాన్ని పార్టీ తీసుకుంది. మొత్తంగా పలు మలుపులు తిరుగుతున్న కన్నడ కాంగ్రెస్ రాజకీయం ప్రస్తుతానికి ఎమ్మెల్యేలు ఇళ్లకు చేరేలా చేసింది. మరి.. కమలనాథులు ఖాళీగా ఉంటారా? మళ్లీ కెలికే ప్రయత్నం చేస్తారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
Full View