వైఎస్ ఫ్యామిలీకి వ‌డ్డీతో స‌హా తీర్చేసిన ఆంధ్రోళ్లు!

Update: 2019-05-24 05:11 GMT
సంక్షేమ ప‌థ‌కాలు ఎన్ని ఉన్నా.. అప్ప‌టివ‌ర‌కూ ఏ రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేయ‌ని వినూత్న కార్య‌క్ర‌మాల‌తో తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో నిలిచిపోయారు దివంగ‌త మ‌హా నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి. ఆరోగ్య శ్రీ కావొచ్చు.. 108 ప్రోగ్రాం అవ్వొచ్చు.. ఫీజు రీయింబ‌ర్స్ మెంట్.. పెన్ష‌న్ పెంపు లాంటి ఎన్నో ప్ర‌జాక‌ర్ష‌క ప‌థ‌కాల్ని తీసుకురావ‌ట‌మే కాదు.. తన త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చే వారు సైతం ఆ కార్య‌క్ర‌మాల్ని ఆప‌లేని ప‌రిస్థితిని తేవ‌టంలో వైఎస్ విజ‌యం సాధించార‌ని చెప్పాలి.

2009లో మెజార్టీ సీట్లు క‌ట్ట‌బెట్ట‌టం ద్వారా రెండోసారి సీఎం అయిన వైఎస్.. అనూహ్య ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న మ‌ర‌ణం చోటు చేసుకుంద‌న్న‌ది తెలిసిందే. వాతావ‌ర‌ణం అనుకూలించ‌క‌ హెలికాఫ్ట‌ర్ ప్ర‌యాణంలో ఆయ‌న మ‌ర‌ణం తెలుగు వారిని శోక‌సంద్రంలో మార్చింది. అప్ప‌టి నుంచి అధికారానికి దూర‌మైన వైఎస్ ఫ్యామిలీకి.. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మ‌ళ్లీ ప‌వ‌ర్ చేతికి వ‌చ్చిన ప‌రిస్థితి.

వైఎస్ మీద ఉన్న అభిమానం.. జ‌గ‌న్ మీద ఉన్న న‌మ్మ‌కం క‌ల‌గ‌లిపి తాజా విజ‌యానికి కార‌ణంగా చెబుతున్నారు. 2009లో ఇచ్చిన అధికారాన్ని ట‌ర్మ్ ఆరంభంలోనే తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయిన వైఎస్ విషాద ఉదంతాన్ని గుర్తు చేసుకున్న ఏపీ ప్ర‌జ‌లు.. ఆయ‌న రాజ‌కీయ వార‌సుడికి వ‌డ్డీతో స‌హా అధికారాన్ని అప్ప‌గించే
Tags:    

Similar News