ఉన్నదున్నటి మాట్లాడేయడం... కంగారుగా మాట్లాడడంతో నందమూరి బాలకృష్ణను మించినవారు లేరు. గతంలో ఎన్నోసార్లు తొందరపాటు మాటలు... అర్థంకాని మాటలతో గందరగోళం సృష్టించిన బాలకృష్ణ ఈసారి బూతు మాటలతో గందరగోళం చేశారు. అదికాస్లా ఇంటర్నెట్ లో చేరడంతో హాట్ టాపిగ్గా మారిపోయింది.
మంగళవారం జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో ఓటేయడానికి వచ్చిన బాలయ్యను మీడియా ప్రతినిధులు కదిపారు. మీడియాతో మాట్లాడాలని ఆయన్ను కోరారు... అందుకు ఆయన కూడా ఓకే అన్నారు....అయితే... తాను విడివిడిగా మాట్లాడలేని, అందరూ ఒకేసారి వస్తే అందరితో కామన్ గా మాట్లాడుతానని చెప్పారు. అందుకు ఓకే అన్న మీడియా ప్రతినిదులు తమ ఏర్పాట్లు చేసుకుని ఆయన వద్దకు వచ్చేసరికి కాస్త ఆలస్యమైంది. వారి కోసం ఓపిగ్గా చూసిన బాలకృష్ణ ఎంతకీ మైకులు ముందు పెట్టకపోవడంతో అసహనానికి గురై బూతులు మాట్లాడారు. అయితే... మీడియాపై చిందేసే ఉద్దేశంతో కాకుండా సరదాగానే ఆయన ఆ మాట అనడం... పైగా మాటల్లో బూతులు వాడడం ఆయనకు అలవాటు కావడంతో అది పెద్ద ఇష్యూ కాలేదు.
అంతవరకు బాగానే ఉన్నా మీడియా ప్రతినిధులో ఎవరో దాన్ని ఎడిట్ చేయకుండానే యూట్యూబ్ లో పెట్టడంతో ఇప్పుడు అందరికీ మంచి మజా దొరుకుతోంది. సోషల్ మీడియలో అది వైరల్ గా షేర్ అవుతోంది. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి కూడా ఇష్టమొచ్చినట్లు పబ్లిగ్గా బూతులు మాట్లాడంపై విమర్శలు వస్తున్నాయి.