కేజ్రీ, చిదంబరంపై బీజేపీ నేత ‘సర్జికల్ స్ట్రైక్స్’

Update: 2016-10-05 12:06 GMT
పీఓకేలో సర్జికల్ స్ట్రైక్సు దృశ్యాలు వెల్లడించాలని డిమాండు చేస్తున్న ఆప్ అధినేత కేజ్రీవాల్ - కాంగ్రెస్ నేతలు చిందంబరం - సంజయ్ నిరుపమ్ లపై మధ్య ప్రదేశ్ కు చెందిన బీజేపీ నేత ఒకరు చేసిన కామెంట్లు వివాదంగా మారాయి. వీడియోలు చూపించాలని డిమాండు చేస్తున్న నేతలపై మాటల దాడి చేసే క్రమంలో ఆయన శ్రుతిమించిన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రామేశ్వర శర్మ కొద్దిసేపటి కిందట  కేజ్రీవాల్ - చిదంబరం - సంజయ్ నిరుపమ్ ల తీరును తప్పుపట్టారు. ఆ సందర్భంలో ఆయన వారు ఎలాంటివారంటే చివరకు వారి తల్లితండ్రుల శోభనం రాత్రి వీడియో దృశ్యాలు కూడా చూపించమని అడిగేలా ఉన్నారు అంటూ కామెంట్లు చేశారు. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రామేశ్వర శర్మవి దిగజారుడు వ్యాఖ్యలంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. "ఆర్మీ జవాన్ల వీరత్వానికి సంబంధించిన ప్రశ్నలడుగుతున్నవారు.. తల్లిదండ్రుల తొలిరాత్రి వీడియోను చూశాకే వారికి పుట్టామని నమ్మేరకం" అంటూ విమర్శించారు. దేశం కోసం భారత ఆర్మీ రక్తం చిందిస్తుంటే, వారిపై నమ్మకం లేని వారు జాతి ద్రోహులేనని, వారంతా పాకిస్థానీ ఏజంట్లని.. వీరంతా నవాజ్ షరీఫ్ లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

అయితే.. శర్మ ఈ దారుణ కామెంట్లు చేసిన సమయానికి అక్కడున్న మరో బీజేపీ నేత - ఎంపీ అలోక్ సంజార్ కూడా తన నోటికి పని చెప్పారు. సర్జికల్ దాడులు నిజమేనా? అని ప్రశ్నిస్తున్న వారు, ముందు తన తండ్రి గురించి తల్లిని అడగాలని అన్నారు. దీంతో బీజేపీ ప్రజాప్రతినిధుల నోటి దురుసుతనం మరోసారి బయటపడింది. రాజకీయ వివాదాలు - ఆరోపణలు ప్రత్యారోపణలు ఎలా ఉన్నా తల్లిదండ్రుల గురించి దారుణ కామెంట్లు చేసి బజారు మనుషుల్లా వ్యవహరించారంటూ వారిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News