బీజేపీ అభ్యర్థులకు పార్టీ ఫండ్ గట్టిగానే!

Update: 2019-03-29 08:14 GMT
ప్రస్తుత ఎన్నికల బరిలో నిలవడానికి ఏపీలో అభ్యర్థులను వెదుక్కోవాల్సి వచ్చింది బీజేపీ. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయకపోవడంతో ఈ సారి అభ్యర్థులుగా కొత్త మొహాలను వెదుక్కోవాల్సి వచ్చింది. అందులోనూ ఏపీలో గత ఐదేళ్లలో బీజేపీ పరిస్థితి మెరుగయ్యింది ఏమీలేదు.పైపెచ్చూ ప్రత్యేకహోదా విషయంలో మోసం చేసిందనే అభియోగాన్నీ ఎదుర్కొంటోంది. బీజేపీని పూర్తిగా కార్నర్  చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు.

ఇలాంటి నేపథ్యంలో బీజేపీ తరఫున పోటీకి అభ్యర్థుల అంత ఉత్సాహంగా కనపడటం లేదు. అయితే పోటీకి మరీ అభ్యర్థులు దొరకని పరిస్థితి అయితే లేదు. చాలా నియోజకవర్గాల్లో బీజేపీ తరఫున నామినేషన్లు దాఖలు అయ్యాయి. దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లోనూ బీజేపీ తరఫున అభ్యర్థులు పోటీలో ఉన్నట్టే.

ఇక ఇదే సమయంలో బీజేపీ అభ్యర్థులకు ఈ సారి పార్టీ ఫండ్ కు ఏ మాత్రం లోటు లేదని తెలుస్తోంది. మొత్తం అభ్యర్థులను ఏ -బీ - సీ - డీ విభాగాలుగా విభజించిందట భారతీయ జనతా పార్టీ. వారిలో ఒక్కో విభాగంలోని వారికి ఒక్కో స్థాయిలో పార్టీ ఫండ్ ను ఇస్తోందని టాక్.

ఏ విభాగంలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల ఖర్చుగా యాభై లక్షల రూపాయల పైనే దక్కుతోందని ఒక ప్రచారం! ఇక మిగతా విభాగాల్లోని వారికి కూడా చదివింపులు బాగానే ఉన్నాయట. ఏ విభాగంలో ఉన్న వారు గట్టిగా పోటీ ఇస్తారనేది ఒక అభిప్రాయం. కాబట్టి వాళ్లకు ఎక్కువ సొమ్ములట. మిగతా వారిది నామమాత్రపు పోటీ కావడంతో వారికి కొంచెం తక్కువ స్థాయిలో ఫండ్ ఇస్తూ ఉన్నారట.

ఏదైతేనేం.. బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ ఫండ్ కు అయితే కొదవలేదని తెలుస్తోంది. ఎంతైనా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో అభ్యర్థులకు ఈ లోటు ఏమీ లేనట్టే!
Tags:    

Similar News