70% మార్కులు వ‌చ్చిన త‌మ్ముళ్లు 13మందేన‌ట‌!

Update: 2018-05-12 06:58 GMT
నేత‌ల ప‌ని తీరును మార్కుల‌తో కొల‌వ‌టం ఈ మ‌ధ్య‌న రాజ‌కీయ పార్టీల‌కు ఎక్క‌వైపోయింది. గ‌తంలో మాదిరి నేత‌ల ప‌నితీరును ఒక క్ర‌మ‌ప‌ద్ద‌తిలో మ‌దింపు చేయ‌టం త‌గ్గింది. స‌ర్వే సంస్థ‌ల‌కు.. న‌మ్మ‌కం ఉన్న  వారికి ప్ర‌జా ప్ర‌తినిధుల ప‌ని తీరు మీద స‌ర్వే నిర్వ‌హించి వారికి మార్కులు వేయ‌టం.. గ్రేడ్లు డిసైడ్ చేయ‌టం ఈ మ‌ధ్య‌న ఎక్కువైంది.

తాజాగా అలాంటి ప‌నే మ‌రోసారి చేశారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. పార్టీ నేత‌ల‌తో సుదీర్ఘంగా స‌మావేశ‌మైన ఆయ‌న‌.. పార్టీకి చెందిన ప్ర‌జాప్ర‌తినిధుల ప‌నితీరు మీద నిర్వ‌హించిన టీడీపీ అంత‌ర్గ‌త స‌ర్వేలో 13 మంది ఎమ్మెల్యేల‌ను 70శాతం మార్కులు వ‌చ్చిన‌ట్లుగా వెల్ల‌డించారు సీఎం చంద్ర‌బాబు - కార్య‌క‌ర్త‌ల నుంచి సేక‌రించిన స‌మాచారం ఆధారంగా తామీ గ్రేడ్ల‌ను డిసైడ్ చేసిన‌ట్లుగా వెల్ల‌డించారు.

లిస్ట్ లో పేర్లు లేని వారు సైతం త‌మ ప‌నితీరును మెరుగుప‌ర్చుకోవాల‌ని కోరారు. నియోజ‌క‌వ‌ర్గంలోని పార్టీ క్యాడ‌ర్ నుంచి సేక‌రించిన స‌మాచారం ఆధారంగా తామీ జాబితాను సిద్ధం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. బాబు చేయించిన స‌ర్వేలో 70 శాతం కంటే ఎక్కువ మార్కులు వ‌చ్చిన నేత‌ల్ని చూస్తే..

1. మంత్రి అచ్చెన్నాయుడు - శ్రీ‌కాకుళం

2. కోళ్ల ల‌లిత కుమారి (విజ‌య‌న‌గ‌రం)

3. చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు (విశాఖ‌ప‌ట్నం)

4. తోట త్రిమూర్తులు (తూ.గో.)

5. వేగుళ్ల జోగేశ్వ‌ర‌రావు (తూ.గో.)

6. చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ (ప‌.గో)

7. రామానాయుడు  (ప‌.గో)

8. రాధాకృష్ణ  (ప‌.గో)

9. గ‌ద్దె రామ్మోహ‌న‌రావు (కృష్ణా)

10. శ్రీ‌రాం తాత‌య్య  (కృష్ణా)

11. బోడె ప్ర‌సాద్ (కృష్ణా)

12. వ‌ల్ల‌భ‌నేని వంశీమోహ‌న్ (కృష్ణా)

13. ధూళిపాళ్ల న‌రేంద్ర (గుంటూరు)

Tags:    

Similar News