బాబును ఇంకా హైద‌రాబాదీ అనుకుంటున్నారట‌

Update: 2016-07-02 10:39 GMT
తెలుగుదేశం పార్టీ అధినేత‌ - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఐటీరంగ అభివృద్ధికి  స్వ‌యంగా కృషిచేసి ఓ గుర్తింపు తీసుకువ‌చ్చిన హైద‌రాబాద్ గురించి ప్ర‌స్తావిస్తుంటారు. అలా అభివృద్ది చేయ‌బ‌ట్టే మ‌రింత ముందుకు సాగుతుంద‌ని అయితే త‌ను పొరుగు రాష్ట్ర సీఎంను అని వివ‌రించుకుంటుంటారు. అయితే ఇప్ప‌టికీ బాబును హైద‌రాబాదీ అనుకుంటున్నారట‌. పైగా రాష్ట్రం విడిపోయిన‌ప్ప‌టికీ హైద‌రాబాద్ ఏపీలో ఉంద‌ని భావిస్తున్నార‌ట‌. విదేశాల్లో ఇదే టాక్ ఉంద‌ని స్వ‌యంగా బాబే తాజాగా వెల్ల‌డించారు.

చైనా ప‌ర్య‌ట‌న ముగించుకొని వ‌చ్చిన చంద్ర‌బాబు విలేక‌రుల సమావేశంలో మాట్లాడుతూ పెట్టుబడులే లక్ష్యంగా జరిగిన తమ చైనా పర్యటన విజయవంతమైందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే హైదరాబాదేనని విదేశీయులు భావిస్తున్నారని చెప్పారు. తనతో మాట్లాడిన వారంతా హైదరాబాద్ గురించి అడిగారని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి అని తను ఇప్పుడు దేశ విదేశాలకు చెప్పాల్సిన అవసరం ఏర్పడిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని చంద్రబాబు విమ‌ర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీని భ్రష్టు పట్టించిందని, ఏపీ పెట్టుబడిదారులంటే అవినీతిపరులన్న ముద్ర వేసిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మన పారిశ్రామికవేత్తలపై ఉన్న మచ్చను తొలగించి, వారిని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నానని చెప్పారు. టియాంజిన్‌ లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సమావేశంలో మొదటి రోజు పారిశ్రామికవేత్తలు - ప్రపంచ స్థాయి కంపెనీల సిఇఓలతో వరసగా భేటీ అయ్యామని చంద్రబాబు అన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సమావేశాల్లో సిటీస్ బై డిజైన్ - నాట్ ఆన్ డిమాండ్ అనే అంశంపై కీలకోపన్యాసం చేశానని చంద్రబాబు వివ‌రించారు.త్వరలో రష్యాలో విమాన రంగంపై సదస్సు జరగనుందని చంద్రబాబు చెప్పారు. దానికి తాను హాజరవుతానన్నారు.
Tags:    

Similar News