2018 అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిలో కాంగ్రెస్ తో సాగిన టీడీపీ ఇప్పుడు తెలంగాణలో తెగతెంపులు చేసుకుంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పోటీకి రెడీ అయ్యింది. అంతేకాదు.. తాజాగా అభ్యర్థిని ఖరారు చేసి బీఫారాన్ని కూడా అందజేయడం విశేషం.
హుజూర్ నగర్ టీడీపీ అభ్యర్థిగా మాజీ జడ్పీటీసీ చావా కిరణ్మయిని అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. ఈ మేరకు టీడీపీ ఆఫీసులో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఆమెకు బీఫారాన్ని అందజేశారు.
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిగా పద్మావతి పోటీచేస్తున్నారు. ఆమె మహిళ కావడం.. ఇప్పుడు కాంగ్రెస్ కు పోటీగా టీడీపీ కూడా మహిళా అభ్యర్థినే బరిలోకి దింపడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మొదట కాంగ్రెస్ కే మద్దతు ఇద్దామని చంద్రబాబు యోచించారట.. కానీ ఆంధ్రా సరిహద్దుల్లో ఉన్న హుజూర్ నగర్ లో టీడీపీ బలంగా ఉందని నేతలు ఈ ప్రతిపాదనకు నో చెప్పారు. టీడీపీ తరుఫున అభ్యర్థిని పోటీకి దింపాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో చంద్రబాబు నేతల కోరిక మేరకు హుజూర్ నగర్ టీడీపీ అభ్యర్థిగా కిరణ్మయిని దింపారు.