అప్పట్లో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా టీవీ చర్చల్లో మాట్లాడిన కత్తి మహేష్ పై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.. గత నెల 29న బంజారాహిల్స్ లోని ఓ తెలుగు న్యూస్ చానెల్ లో జరిగిన చర్చలో పాల్గొన్న కత్తి మహేష్ రాముడు సీతపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇవి హిందువుల మనోభావాలను దెబ్బతీశాయి. దీనిపై అదేరోజు యూసఫ్ గూడు సమీపంలోని రహ్మత్ నగర్ కు చెందిన గడ్డం శ్రీధర్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఈ కేసు నమోదయ్యాక పోలీసులు న్యాయ సలహా తీసుకున్నారు. సలహా కోసం ఇన్నాళ్లుగా ఆగిన పోలీసులు ఎట్టకేలకు ఆ కేసు విషయంలో శుక్రవారం కత్తి మహేష్ పై ఐపీసీ సెక్షన్ 295(ఏ) - 505(2) కింద క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కత్తి మహేష్ వ్యవహారశైలి ఆది నుంచి వివాదాస్పదం కావడం.. అల్లర్లకు కారణం కావడంతో తెలంగాణ పోలీసులు ఆయనపై నగర బహిష్కరణ వేటు వేశారు. ప్రస్తుతం కత్తి మహేష్ బెంగళూరుతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే అప్పట్లో నమోదైన ఫిర్యాదులకు తాజాగా కేసులు నమోదయ్యాయి. దీంతో కత్తిమహేష్ మరోసారి చిక్కుల్లో పడ్డట్టు అయ్యింది.