ఇప్పటివరకు ఫ్రంట్ లైన్ వారియర్స్ కు మాత్రమే అందుబాటులో ఉన్న కరోనా టీకా.. మరికొద్ది రోజుల్లో సామాన్యులకు అందుబాటులోకి రానుంది. మార్చి ఒకటో తేదీ నుంచి 60 ఏళ్లకు పైబడిన వారందరికీ.. 45 నుంచి 60 ఏళ్ల లోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా వేయాలని ప్రభుత్వం డిసైడ్ కావటం తెలిసిందే. ఈ నేపథ్యంలో అందరికి అందుబాటులో టీకా ఉంచేందుకు వీలుగా.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ జాబితాలో ఉన్న ప్రైవేటు.. కార్పొరేట్.. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు తప్పించి అన్ని ఇతర ఆసుపత్రుల్లో టీకా వేసేందుకు అనుమతి లేదని స్పష్టం చేశాయి.
ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకాను ఉచితంగా వేయరు. అందుకు ఛార్జీలు వసూలు చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల లెక్కల ప్రకారం టీకా ధర రూ.300 నుంచి రూ.400 మధ్యలో ఉండే అవకాశం ఉందంటున్నారు. దీనిపై రెండురోజుల్లో స్పష్టత రానుంది. ఇప్పటివరకు ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వేసిన టీకాలన్ని ఉచితంగానే కావటం గమనార్హం.
ప్రైవేట్ లో వ్యాక్సిన్ వేస్తున్నారన్నంతనే.. ఇష్టారాజ్యంగా టీకా ప్రోగ్రాం ఉండదని చెబుతున్నారు. తొలుత పేరు నమోదు చేసుకోవటం.. మొబైల్ కు వచ్చే ఓటీపీ ద్వారానే వ్యాక్సిన్ వేసే వీలు ఉందని.. అందుకు యాప్ ను వినియోగించాల్సి ఉంటుంది. యాప్ లో వివరాలు నమోదు చేసిన తర్వాతే వ్యాక్సిన్ ఇస్తారు. అర్హులైన వారి పేర్లను మాత్రమే వ్యాక్సిన్ వేయించుకోవటానికి అనుమతి ఇవ్వనున్నారు. ప్రైవేటులో డబ్బులు చెల్లించి మాత్రమే టీకా వేయించుకునే అవకాశం ఉంది. అదే సమయంలో.. ప్రభుత్వ దవాఖానాల్లో మాత్రం ఉచితంగా టీకా పొందే వీలుంది. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో 1250కు పైగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకాను అందుబాటులో ఉంచనున్నారు. రానున్న రోజుల్లో 4500లకు పైగా ఆరోగ్య ఉప కేంద్రాల్లో టీకా అందుబాటులో ఉంచనున్నట్లు చెబుతున్నారు.