మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇప్పటికే టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే స్థానానికి సైతం రాజీనామా చేసి టీఆర్ఎస్ లో ఫైట్ కు రెడీ అయ్యారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ను ఓడించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు.
ముందుగా శామీర్ పేటలోని తన నివాసం నుంచి కార్యకర్తలు,మ ద్దతుదారులతో బయలు దేరిన ఈటల గన్ పార్క్ కు చేరుకున్నారు. అక్కడి అమరవీరుల స్థూపానికి ఈటల రాజేందర్ నివాళులర్పించారు. అనంతరం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలోకి వెళ్లి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖను అందజేశారు. స్పీకర్ ఫార్మాట్ లో తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి అందజేసిన ఈటల.. సాయంత్రం ఢిల్లీ వెళ్లి 14వ తేదీన బీజేపీలో చేరనున్నారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. 17 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఓటమి లేకుండా ప్రజల్లో ఉన్నానని.. తెలంగాణ కోసం అసెంబ్లీ వేదికగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రశ్నించానని తెలిపారు. ఎంతో పోరాడానని.. ఇతర పార్టీలలో గెలిచి టీఆర్ఎస్ లో చేరి చాలా మంది మంత్రులయ్యారని ఎద్దేవా చేశారు. చట్టాన్ని అతిక్రమించి టీఆర్ఎస్ లో చేరినవాళ్లూ ఉన్నారని.. వందల, వేల కోట్లు ఉన్న వాళ్లను వదిలేసి నాలాంటి బిడ్డపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని ప్రజలు అభిప్రాయపడ్డారని ఈటల వివరించారు.
కేసీఆర్ కుటుంబానికి.. హుజూరాబాద్ ప్రజలకు మధ్య హుజూరాబాద్లో ఘర్షణ జరగబోతోందని.. కౌరవులు, పాండవులు మధ్య కురుక్షేత్రం సాగుతుందని ఈటల అన్నారు. హుజూరాబాద్ ప్రజల ఆశీర్వాదంతో తాను రాజీనామా చేస్తున్నానని ఈటల అన్నారు. హుజూరాబాద్ కదిలి రండి.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం రాబోయేకాలంలో పోరాటం చేస్తా అంటూ ఈటల బదులిచ్చారు.