ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన భవిష్యత్ ఎజెండాను ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీని హుజూరాబాద్ ఎన్నికల్లో ఓడించడం.. తెలంగాణ విముక్తియే నా అజెండా అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే పదవికి ఈరోజు ఈటల రాజేందర్ రాజీనామా చేశారు. శామీర్ పేటలోని తన నివాసం నుంచి కార్యకర్తలు,మ ద్దతుదారులతో బయలు దేరిన ఈటల గన్ పార్క్ కు చేరుకున్నారు. అక్కడి అమరవీరుల స్థూపానికి ఈటల రాజేందర్ నివాళులర్పించారు. అనంతరం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలోకి వెళ్లి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖను అందజేశారు. స్పీకర్ ఫార్మాట్ లో తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి అందజేసిన ఈటల.. సాయంత్రం ఢిల్లీ వెళ్లి 14వ తేదీన బీజేపీలో చేరనున్నారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ భావోద్వేగంతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో చాలా కష్టపడ్డానని..సమైక్య పాలకుల మీద అసెంబ్లీలో గర్జించానని ఈటల చెప్పుకొచ్చారు. 17 ఏళ్లలో ఎన్నడూ ఎమ్మెల్యేగా ఓడిపోలేదని తెలిపారు.
టీఆర్ఎస్ బీఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచినా.. గెలిపించింది మాత్రం హుజూరాబాద్ ప్రజలేనని తెలిపారు. అమరవీరుల సాక్షిగా ముందుకెళ్తానన్న ఈటల.. కేసీఆర్ పాలన నుంచి తెలంగాణ విముక్తే తన అజెండా అని స్పష్టం చేశారు.
కేసీఆర్ అహంకారాన్ని జనం ఛీ కొడుతున్నారని.. హుజూరాబాద్ ప్రజలు టీఆర్ఎస్ ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని ఈటల అన్నారు. వాళ్లే తనను రాజీనామా చేయమని పంపించారని ఈటల చెప్పుకొచ్చాడు.