కమ్యూనిస్టులకు, కాషాయ బీజేపీ వాళ్లకు అస్సలు పడదు. వాళ్లు ఫక్తు నాస్తికులు, లౌకిక వాధులు.. వీళ్లమో పక్కా హిందుత్వా భావజలం గలవారు. కానీ ఒకప్పుడు కమ్యూనిస్టు అయిన ఈటల రాజేందర్ ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్మాయమైన బీజేపీలో చేరుతున్నారు. కాలం పెట్టిన పరీక్షలో ఆయన బీజేపీలో ఉంటేనే సేఫ్ అని భావిస్తున్నాడు. దీనిపై చాలా విమర్శలు చెలరేగినా ఈటల ముందుకే వెళుతున్నాడు.
తాజాగా ఈటల బీజేపీలో చేరికపై టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు, శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో ఎటువంటి హత్యలు ఉండవని, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయని ఆయన అన్నారు. రెండు రోజుల్లో బిజెపిలో చేరడానికి సిద్ధంగా ఉన్న ఈటల రాజేందర్ రాజకీయంగా తనను తాను చంపుకుంటున్నాడని ఆయన విమర్శించారు.
నల్గొండలో మీడియాతో మాట్లాడిన గుత్తా.. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఎన్నోసార్లు ఈటలకు ఎంతో గౌరవం ఇచ్చారని, అయితే ఈటల అనవసర పంతాలకు పోయి తన రాజకీయ జీవితాన్ని స్వయంగా నాశనం చేసుకుంటున్నారని అన్నారు. తన ఆస్తులను కాపాడుకోవడానికి మాత్రమే ఈటల రాజేందర్ బిజెపిలో చేరుతున్నారని, హుజురాబాద్ ఉప ఎన్నికలో ఆయన ఖచ్చితంగా ఓడిపోతానని గుత్తా జోస్యం చెప్పాడు.
రాబోయే 20 సంవత్సరాలు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని ఈటల నొక్కి చెప్పారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయ రంగం అపారమైన వృద్ధిని కనబరుస్తోందని తెలిపారు. మాజీ ఎంపీ 2026లో నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని.. ఆ సమయంలో వివిధ నియోజకవర్గాల్లో రిజర్వేషన్లు కూడా మారుతాయని చెప్పారు. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల ఆధారంగా మాత్రమే తదుపరి ఎన్నికలు నిర్వహిస్తారని చెప్పారు. ప్రధానమంత్రి మోడీ ఇమేజ్ పడిపోయిందని.. ఆయన గ్రాఫ్ దేశవ్యాప్తంగా క్షీణిస్తున్న ధోరణిని కనిపిస్తోందని గుత్తా అభిప్రాయపడ్డారు.