ఉత్తరప్రదేశ్ లో లా విద్యార్థిని మిస్సింగ్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ లా విద్యార్థినిని బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద్ కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడని ఆరోపణలు వచ్చాయి. స్వయంగా లా విద్యార్థిని ఫేస్ బుక్ లో తనను స్వామి చిన్మయానంద్ లైంగిక వేధింపులు చేశాడని వీడియో పోస్ట్ చేసి ప్రధాని - యూపీ సీఎంను న్యాయం చేయాలని కోరింది. ఆ తర్వాత మాయమైపోయింది. ఆమెను చిన్మయానందే కిడ్పాప్ చేశాడని దుమారం రేగింది.
ఈ వ్యవహారాన్ని సుమోటాగా తీసుకున్న సుప్రీం కోర్టు యూపీ ఐజీ స్థాయి పోలీస్ అధికారిని ఇన్చార్జిగా పెట్టి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. విచారించేందుకు ప్రత్యేక కోర్టు బెంచ్ ను కూడా ఏర్పాటు చేసింది.
తాజాగా సిట్ అమ్మాయి ఆచూకీ తెలుసుకొని విచారించారు. అందులో నమ్మలేని విషయాలు వెలుగుచూశాయి. తాజాగా పోలీసులు 12 పేజీల స్టేట్ మెంట్ ను బాధిత లా విద్యార్థి నుంచి రికార్డ్ చేశారు. చిన్మయానంద తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తన విద్యాసంస్థ హాస్టల్ లో పెట్టాడని.. బాత్రూంలో స్నానం చేస్తున్న తన వీడియో తీసి పలుమార్లు అత్యాచారం చేశాడని.. గన్ మెన్ లతో బెదిరించాడని ఆమె ఆరోపించింది. సంవత్సరం నుంచి తనపై అత్యాచారం చేస్తూ వేధించాడని సంచలన విషయాలు చెప్పుకొచ్చింది. తన కుటుంబం పేదరికం కావడంతో తాను ఈ ఆగడాలు భరించినట్టు చెప్పుకొచ్చింది.
ఇక చిన్మయానందకు మద్దతుగా సంత్ సమాజ్ కు చెందిన ఓ పెద్దాయన చాలా మంది అమ్మాయిలను రేప్ చేయించాడని.. తనను కూడా హత్య చేయడానికి ప్రయత్నించాడని లా విద్యార్థిని సిట్ ముందు నోరు విప్పింది. రెండు రోజుల నుంచి సిట్ పోలీసులు 11 గంటలపాటు ఆమెను విచారించి స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. ఇప్పుడు యువతి స్టేట్ మెంట్ ఆధారంగా చిన్మయానందపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు..