రామ్మోహ‌న్ నాయుడు రిసెప్ష‌న్‌ కు భారీ ఏర్పాట్లు!

Update: 2017-06-17 10:53 GMT
ఉత్త‌రాంధ్ర‌లో టీడీపీకి కీల‌క‌మైన నేత కింజ‌ర‌పు ఎర్ర‌న్నాయుడు హ‌ఠాన్మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న త‌న‌యుడు రామ్మోహ‌న్ నాయుడు రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. తండ్రికి తగ్గ తనయుడిగా  రాజ‌కీయాల్లో రాణిస్తున్నారు. ఆయ‌న‌ వివాహం ఈ నెల 14న విశాఖపట్నంలో గ్రాండ్‌ గా జ‌రిగిన సంగతి తెలిసిందే.

అదే విధంగా జూన్ 18న జ‌ర‌గ‌నున్న రిసెప్ష‌న్‌ కు కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయ‌న స్వగ్రామం నిమ్మాడలో రిసెప్ష‌న్ ప‌నులు వ‌ర‌వేగంగా జరిగిపోతున్నాయి. బాబాయ్‌ లు మంత్రి అచ్చెన్నాయుడు - హరివరప్రసాద్‌ - ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అశోక్‌ - చౌదరి బాబ్జి - యార్లగడ్డ వెంకన్నచౌదరి - అలాగే కుటుంబ సభ్యులు ఈ ఏర్పాట్లను ద‌గ్గ‌రుండి పర్యవేక్షిస్తున్నారు.

నిమ్మాడలోని ఎఫ్‌ సీఐ గోదాములకు సమీపంలోని 20 ఎకరాల స్థలంలో రిసెప్షన్‌ జరగనుంది.ఆ రోజు భారీ వర్షం కురిసినా అతిథులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. రిసెప్షన్  స్టేజీ - డెకరేషన్ వర్క్ కోసం అద్దంకికి చెందిన డెకరేషన్‌ బృందం 10రోజులుగా శ్రమిస్తోంది.


రిసెప్షన్ ప్రాంగణంలో ఏసీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 2లక్షల చదరపు అడుగుల స్థలంలో భారీ షెడ్స్ ఏర్పాటు చేస్తున్నారు. వందేమాతరం శ్రీనివాస్ కు చెందిన ఆర్కెస్ట్రా టీమ్ ఈ వేడుకలో వినోదాన్ని పంచ‌బోతున్నారు. ఈ రిసెప్షన్ కు సినీ నటుడు - హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరయ్యే అవ‌కాశ‌ముంది.

ప్రముఖులు చాలామంది రిసెప్షన్ కు వచ్చే అవకాశం ఉంది. దీంతో, కాశీబుగ్గ డీఎస్పీ సీహెచ్. వివేకానంద పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. ట్రాఫిక్ స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌కుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

రిసెప్ష‌న్ కోసం నిమ్మాడ గ్రామం విద్యుద్దీపాలతో కాంతులీన‌నుంది. ఈ నెల‌ 17న నిమ్మాడలో గుర్రం బగ్గీపై రామ్మోహన్ నాయుడి ఊరేగింపు కార్యక్రమం జరగనుంది. ధవళేశ్వ‌రానికి చెందిన‌ వంట సిబ్బంది 15రకాల వంటలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో తాపేశ్వరం ఖాజా - చక్రపొంగళి - పనసకాయ బిర్యానీతో పాటు నాలుగు రకాల కూరలు - జిల్లా ఫేమస్ అయిన గూనచారు తదితర వంటలు చేయనున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News