నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి విపక్షాలపై ఘాటు ఆరోపణలు చేశారు.పెద్దనోట్ల రద్దుతో సామాన్యులు తీవ్ర అవస్థలు పడుతున్నారని... బీజేపీ - టీడీపీ కుట్ర ఫలితంగానే ఈ నిర్ణయం వెలువడిందని గుత్తా ఆరోపించారు. బీజేపీ - టీడీపీ పొత్తు మూలంగా దేశంలో ఎన్నో సమస్యలు నెలకొన్నాయన్నారు. అవినీతిని అరికట్టడంతోపాటు నల్లధనం వెలికితీసే ప్రయత్నానికి తాము వ్యతిరేకం కాదని, అకస్మాత్తు నిర్ణయంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారనేదే తమ ఆవేదన అని గుత్తా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన జీవీకే - జీఎమ్మార్ - ప్రోగ్రెసివ్ కన్ స్ట్రక్సన్స్ - సుజనాగ్రూప్ - ల్యాంకో వంటి సంస్థలు రెండు లక్షల కోట్లు అప్పులు తీసుకొని చెల్లించకున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు.
తెలంగాణలో టీడీపీ రంగు వెలిసిన పార్టీ అని గుత్తా సుఖేందర్ రెడ్డి ఎద్దేవాచేశారు. 2014 ఎన్నికల నుంచి మొదలుకొని ఆ తర్వాత ప్రతి సందర్భంలోనూ ఇది రుజువు అవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ ఇలా బలహీనపడుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొందర్ని పిట్టల దొరలుగా అప్పుడప్పుడు తయారు చేస్తుంటాడని, వారిలో ఒకరైన రేవంత్‌రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని గుత్తా మండిపడ్డారు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కోసం 2002లో చంద్రబాబుతో తాను విభేదించాననే విషయాన్ని, ఆ ప్రాజెక్టు గురించి తాను పట్టించుకోలేదని రేవంత్‌రెడ్డి విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. హద్దుమీరి విమర్శలు చేసేముందు తన నిజాయితీ ఏమిటో తెలుసుకోవాలని గుత్తా వ్యాఖ్యానించారు. జైలుకు పోయివచ్చిన వారిని సంఘ బహిష్కరణ చేయాలా, ప్రజల్లో ఉన్నవారిని సంఘ బహిష్కరణ చేయాలా? అనేది ప్రజలే నిర్ణయిస్తారని ఆయన మండిపడ్డారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ హయాంలో డబ్బు ప్రస్తావన లేకపోయినప్పటికీ చంద్రబాబు సీఎం అయ్యాక డబ్బులేనిదే రాజకీయాలు చేయలేని పరిస్థితి దాపురించిందన్నారు. ధన రాజకీయాలకు ఆధ్యుడైన చంద్రబాబు సుద్దులు చెప్పడంలో మాత్రం ముందుంటారని గుత్తా మండిపడ్డారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/