పార్టీలు మారటం ఇప్పుడు చాలా మామూలు వ్యవహారం అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికారపక్షాలు నిర్వహిస్తున్న ఆపరేషన్ ఆకర్ష్ తో తలపండిన రాజకీయ నేతలు సైతం పార్టీలు మారిపోతున్న పరిస్థితి. తాజాగా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి.. వివేక్.. వినోద్ లతో పాటు.. నల్గొండ పార్లమెంటు పరిధిలోని మిర్యాలగూడ.. దేవరకొండ.. నల్గొండ అసెంబ్లీ సిగ్మెంట్లకు చెందిన పలువురు నేతలు గులాబీ కండువాలు కప్పుకొని తెలంగాణ అధికారపార్టీలోకి అఫీషియల్ గా చేరిపోయరు.
టీఆర్ ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం దగ్గర కోలాహల వాతావరణంలో ఈ జాయినింగ్ చోటు చేసుకుంది. ఇంత జరిగినా.. నల్గొండ ఎంపీ గుత్తా మాత్రం గులాబీ కండువా వేసుకోకపోవటం గమనార్హం. ఇక.. మీడియా సమావేశంలో సైతం.. గుత్తా పార్టీ మారుతున్న విషయాన్ని ఒక్కసారి మినహా కేసీఆర్ మళ్లీ ప్రస్తావించకపోవటం గమనార్హం. పార్టీ మారేందుకు సిద్ధం అయ్యాక కూడా గులాబీ కండువా కప్పుకోకపోవటానికి కారణం సాంకేతిక అంశాలే అని చెబుతున్నారు. గులాబీ కండువా కప్పుకొని.. పార్టీ మారినట్లుగా ఆధారం లభిస్తే.. తనపై అనర్హత వేటు పడే అవకాశం ఉందని.. అందుకే గుత్తా కండువా మార్చుకోలేదని చెబుతున్నారు.
తాను పార్టీ మారటాన్ని కాంగ్రెస్ అధినాయకత్వం సీరియస్ గా తీసుకుంటుందని.. తనపై అనర్హతా వేటు వేసేందుకు సిద్ధమవుతుందన్న విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు గుత్తా స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. పార్టీ మారే విషయమై కేసీఆర్ తో జరిగిన మొదటి భేటీలోనే తాను తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్న విషయాన్ని గుత్తా చెప్పగా.. ఇప్పటికిప్పుడు పదివికి రాజీనామా చేయొద్దన్న మాటను కేసీఆర్ చెప్పినట్లుగా తెలుస్తోంది.
గుత్తా తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన పక్షంలో మళ్లీ మరో ఉప ఎన్నికను ఎదుర్కోవాల్సి వస్తుందని.. వరుసగా ఉప ఎన్నికలు జరగటం ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉందని.. అందుకే కొంతకాలం వరకూ రాజీనామాను వాయిదా వేసుకోవాలని కేసీఆర్ కోరినట్లుగా చెబుతున్నారు. వరుస ఉప ఎన్నికలు అంటే ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబికే ప్రమాదం ఉందని.. అందుకే కొంతకాలం ఎన్నికలకు గ్యాప్ ఇవ్వాలన్న సూచనతో పాటు.. వర్షాలు పడి.. ప్రాజెక్టులు ఒక షేప్ కు వచ్చిన తర్వాత రాజీనామా చేసేసి ఉప ఎన్నికకు వెళ్లినా ప్రజలు సంతోషంగా గెలిపిస్తారన్న వాదనను కేసీఆర్ విపించినట్లుగా తెలుస్తోంది.
కేసీఆర్ మాటలకు కన్విన్స్ అయిన గుత్తా తన ఎంపీ పదవికి రాజీనామా చేయలేదని చెబుతున్నారు. గుత్తా పార్టీ మారినప్పటికి టెక్నికల్ గా కాంగ్రెస్ ఎంపీ అన్నట్లుగా వ్యవహరించాలని నిర్ణయించిన నేపథ్యంలోనే గుత్తా మెడలో గులాబీ కండువాను వేయలేదని చెబుతున్నారు. గుత్తా మెడలో గులాబీ కండువా వేయటం ద్వారా సాంకేతికంగా పార్టీ మారటంతో పాటు.. అనర్హత వేటు పడుతుందన్న ఉద్దేశంతో కండువా వేసుకోలేదని చెబుతున్నారు. కేసీఆర్ వ్యూహానికి కాంగ్రెస్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.