రాజీనామాకు జంకుతున్న జంపింగ్ ఎంపీ!

Update: 2016-09-02 17:48 GMT
ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌లో భాగంగా కారెక్కిన కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ప‌ద‌వికి ఎప్పుడు రాజీనామా చేస్తారు? టీఆర్‌ ఎస్‌ లో చేరుతున్న స‌మ‌యంలో పుష్కరాల తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్న ప్రకటనపై గుత్తా వైఖ‌రి ఏంటి? ఎందుకు ఆయ‌న ప‌ద‌వి వీడ‌టంపై పెద‌వి విప్ప‌డం లేదు? ఓడిపోతాన‌నే భ‌య‌మే ఇందుకు కార‌ణ‌మా? ఇది రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం. అయితే దీనికి గుత్తా ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు.

తాజాగా గుత్తా మీడియాతో మాట్లాడుతూ  గులాబీ ద‌ళ‌ప‌తి - సీఎం కేసీఆర్ ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. తాను ప‌ద‌వి పోతుంద‌నే భ‌యంతో ఏమీ లేన‌ని చెప్పారు. త్వ‌ర‌లో త‌న రాజీనామాపై స్ప‌ష్టత వ‌స్తుంద‌ని చెప్పారు. పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితుల పునరావాస - సహాయ చర్యల పూర్తి కోసం 115 కోట్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు లేఖ రాసినట్లుగా గుత్తా తెలిపారు. పులిచింతలతో ముంపునకు గురైన 13 గ్రామాల ప్రజలకు సహాయ - పునరావాస చర్యలకు ఏపీ ప్రభుత్వం నుండి 115 కోట్లు రావాల్సి ఉంద‌ని గుత్తా అన్నారు. అలాగే పులిచింతల కింద మూడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ లకు 48 కోట్ల ప్రతిపాదనలను ఏపీకి సమర్పించారన్నారు. ప‌లు గ్రామాల ప్రజలకు పూర్తిగా ఆర్‌ ఆండ్‌ ఆర్ ప్యాకేజీ అసంపూర్తిగా మిగిలిందని దీంతో వారు గ్రామాల ఖాళీకి మొండికేస్తున్నారని గుత్తా చెప్పారు. అయితే నల్లగొండ కలెక్టర్ - జేసీ వారిని ఒప్పించి సహాయ పునరావాసాలపై భరోసానిచ్చి వారిని ముంపు గ్రామాల నుండి పునరావాస గ్రామాలకు తరలిస్తున్నారన్నారు. రెండు ప్రాజెక్టుల పరిధిలోని నిర్వాసిత ప్రజలకు నష్టపరిహారం - పునరావాసం చెల్లింపునకు వెంటనే 115 కోట్లు మంజూరు చేసేలా చంద్రబాబు చర్యలు తీసుకోవాలని గుత్తా కోరారు.
Tags:    

Similar News