దేశంలో కరోనా రోగులను పరీక్షించేందుకు కోట్లాది కిట్లు అవసరం అవుతాయి. ప్రస్తుతం విదేశాల నుంచి టెస్టింగ్ కిట్లు మనం దిగుమతి చేసుకుంటున్నాం. అయితే భారత దేశం లోనే మేడిన్ ఇండియా స్ఫూర్తితో తక్కువ ఖర్చుతో కరోనాను నిర్ధారించే టెస్ట్ కిట్ ను ఐఐటీ ఢిల్లీ రూపొందించింది. ఈ కిట్ తయారీకి అంతా స్వదేశీ సాంకేతికతను ఉపయోగించడం విశేషం. ఇక తాజాగా ఈ విధానానికి ఐసీఎంఆర్ ఆమోదం తెలిపింది.
దీని ద్వారా దేశంలో ఎక్కువ మందికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వీలవుతుంది అని , అలాగే దీనితో తక్కువ ఖర్చులోనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయవచ్చు. ఇక ఐసీఎంఆర్ నుంచి అనుమతులు పొందిన తొలి విద్యా సంస్థ ఐఐటీ ఢిల్లీ కావడం విశేషం. ఈ కిట్ వంద శాతం కరోనాను ఖచ్చితంగా గుర్తిస్తుందని ఐసీఎంఆర్ ధృవీకరించింది.
పాలిమరేజ్ చైన్ రియాక్షన్ (పీసీఆర్) ఆధారంగా ఈ పరికరం పని చేస్తుందని తెలుస్తోంది. కాగా, చైనా తయారీ కిట్ల ద్వారా కరోనా పరీక్షల నిర్వహణను ఐసీఎంఆర్ ఇప్పటికే నిలిపేసిన సంగతి తెలిసిందే. కాగా, ఢిల్లీ ఐఐటీ నిధులతో రూపొందించిన ఈ కిట్ పై పేటెంట్ పరిశోధక బృందం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోరా మహమ్మారికి వ్యాక్సిన్ తయారీలో వివిధ ఫార్మా సంస్థలు తల మునకలై వున్నాయి.