శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మ వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తూ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారారు. ఈ ఏడాది మేలో జరిగిన టీడీపీ మహానాడులో తన దూకుడైన ప్రసంగం ద్వారా కావలి గ్రీష్మ.. చంద్రబాబు, నారా లోకేష్ దృష్టిలో పడ్డారు. దీంతో గ్రీష్మ సైతం ఆ దూకుడును కొనసాగించారు. ఇప్పుడు ఈ దూకుడుతో ఆమె చేసిన కామెంట్లను టీడీపీ అధిష్టానం సీరియస్ గా తీసుకుందనే అబిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఒంగోలు వేదికగా మే నెలలో జరిగిన టీడీపీ మహానాడులో తొడగొట్టి సంచలనం సృష్టించారు.. కావలి గ్రీష్మ. తన పదునైన మాటల ద్వారా చిన్న వయసులోనే టీడీపీ ఫైర్ బ్రాండ్ గా గ్రీష్మ ముద్రపడ్డారు. ఈ క్రమంలో వైసీపీ నేతల నుంచి ఘాటు విమర్శలే ఎదుర్కొన్నారు. అయినప్పటికీ గ్రీష్మ వెనక్కి తగ్గలేదు.
గ్రీష్మ ఎవరో కాదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి ప్రతిభాభారతి 1983 నుంచి 1999 వరకు వరుసగా ఐదుసార్లు గెలుపొందారు. ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు.
చంద్రబాబు హయాంలోనే తొలి మహిళా స్పీకర్ గా ప్రతిభా భారతి బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాకుండా తొలి దళిత స్పీకర్ గానూ రికార్డు సృష్టించారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో ప్రతిభాభారతి రాజాం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో 2019 ఎన్నికల్లో ఆమెకు టీడీపీ సీటు ఇవ్వలేదు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన కొండ్రు మురళీ మోహన్ కు సీటు ఇచ్చింది. అయితే ఆయన కూడా ఓడిపోయారు.
ఈ నేపథ్యంలో ఒక టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కావలి గ్రీష్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో రాజాం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. రాజాం టీడీపీ అధ్యక్షురాలిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నానని తెలిపారు.
తాను ఎమ్మెల్యే అవుతానని.. చంద్రబాబును సీఎంగా చేయడమే తన లక్ష్యమని కావలి గ్రీష్మ వెల్లడించారు. నారా లోకేష్ తో సైతం తన మనసులో మాటను చెప్పానని.. మనం కలసి పనిచేద్దామని ఆయన భరోసా ఇచ్చారని తెలిపారు. తన భర్త మంచి ఉద్యోగం చేస్తున్నారని.. డబ్బులు గురించి తనకు ఇబ్బంది లేదని వ్యాఖ్యానించారు. డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి, త్యాగాలు చేయడానికి రాజకీయాల్లో సిద్ధంగా ఉండాలన్నారు. ఈ రెంటికీ తాను సిద్దంగా ఉన్నానని గ్రీష్మ తేల్చిచెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజాం టీడీపీలో ఉన్న కోండ్రు మురళీమోహన్ కు వచ్చే ఎన్నికల్లో సీట్లు దక్కనట్టేనా అనే చర్చ జరుగుతోంది. కావలి గ్రీష్మ అసెంబ్లీ టికెట్ పై తనకు లోకేష్ హామీ ఇచ్చారని చెబుతుండటం ఇందుకు ఊతమిస్తోంది. అంతేకాకుండా టీడీపీకి స్థిరంగా ఉండే నేతలే కావాలని.. జంపింగ్ చేసే వాళ్లు కాదని గ్రీష్మ వ్యాఖ్యానించడం కొసమెరుపు.
టీడీపీకి స్థిరంగా ఉండేవాళ్లు కావాలో.. జంపింగ్ జపాంగ్ లు కావాలో చంద్రబాబు తేల్చుకోవాలని అన్నట్టు గ్రీష్మ ఆల్టిమేటం జారీ చేయడంపై టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిందని అంటున్నారు.
గ్రీష్మ వ్యాఖ్యలతో పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. 2019లో రాజాం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కొండ్రు మురళీ.. గ్రీష్మ వ్యాఖ్యలకు కలత చెంది మురళీ మళ్లీ వేరే పార్టీలోకి వెళ్తే పరిస్థితి ఏమిటనే ఆందోళన టీడీపీలో ఉందని అంటున్నారు.ఈ నేపథ్యంలో గ్రీష్మ చేసిన వ్యాఖ్యలపై ఆమె వివరణ కోరే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.