ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తున్న ఐఎస్ ఐఎస్ లో భారీ స్థాయిలో రిక్రూట్ మెంట్లు జరిగాయి. ప్రస్తుతం దాదాపు లక్షన్నర మంది ఫైటర్ల(ప్రాణాలు అర్పించి మరి చంపేందుకు సిద్ధమైనవారు) ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విద్యాధికులే ఎక్కువ సంఖ్యలో ఉండటం పట్ల సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలా ఉగ్రవాదం వైపు ఆకర్షితులు కావడానికి వివక్ష - పేదరికం - నిరుద్యోగం కారణాలుగా గతంలో భావించేవారు. అయితే - అభివృద్ధి చెందిన - ఆర్థిక అసమానతలు పెద్దగా లేని దేశాలకు చెందిన విద్యాధికులైన ముస్లిం యువకులు ఐఎస్ ఐఎస్ లో చేరుతూ ఆ భావన తప్పని నిరూపిస్తున్నారు. దీంతో ఆర్థికాభివృద్ధికి - ఉగ్రవాదంలో చేరడానికి ఎలాంటి సంబంధమూ లేదనే విషయం అర్థమైంది.
సామాజిక అభివృద్ధి సూచికలో కొంత వెనుకబాటుతనం కూడా ఐఎస్ ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థల్లో ఈ యువకులు చేరేందుకు పరోక్షంగా కారణం కావచ్చని వారు భావిస్తున్నారు. అదే సమయంలో ఓ దేశ జనాభాలో ముస్లింల సంఖ్యకు - ఐఎస్ ఐఎస్ లో విదేశీ ఫైటర్లు చేరడానికి మాత్రం ప్రత్యక్ష సంబంధం ఉందని వారు స్పష్టం చేస్తున్నారు. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న దేశాల నుంచి ఐఎస్ ఐఎస్ లో ఎక్కువ మంది చేరుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈమధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మంది విదేశీ ఫైటర్లు ఐఎస్ ఐఎస్ పట్ల ఆకర్షిలవుతున్నారన్న సంగతి స్పష్టమవుతున్నప్పటికీ - వారు అలా ఎందుకు చేరుతున్నారన్న అంశాలను మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో విశ్లేషించలేకపోతున్నారు. అయితే, మధ్య ప్రాచ్యం - అరబ్ దేశాల నుంచే ఎక్కువ మంది విదేశీ ఫైటర్లు ఐఎస్ ఐఎస్ లో చేరుతున్నా - ఐరోపా కూటమి దేశాలతో పాటు, అమెరికా - కెనడా - ఆ్రస్టేలియా - న్యూజిలాండ్ వంటి పాశ్చాత్య దేశాలు - రష్యా - ఇండోనేషియా - తజకిస్తాన్ వంటి దేశాల నుంచి కూడా వేలాది మంది విదేశీ ఫైటర్లు ఐఎస్ ఐఎస్ ఉగ్రవాదులుగా మారుతున్నారని నివేదికలు చెబుతున్నాయి.
కాగా, 2015 డిసెంబర్ నాటికి దాదాపు 85 దేశాల నుంచి 30 వేల మంది విదేశీ ఫైటర్లు ఐఎస్ ఐఎస్ ఉగ్రవాదులుగా చేరినట్టు తెలుస్తోంది. దీంతోనే ఈ తీవ్రవాద సంస్థ ప్రపంచ దేశాలకు సవాలు విసురుతోందని, ఉగ్రవాదులుగా మారిన అనంతరం వారు తమ స్నేహితులు - బంధువులు - మతానికి చెందిన వారిని సానుభూతిపరులుగా మార్చుకుని ఆయాదేశాల్లో దాడులకు పాల్పడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సంఖ్య ఇపుడు లక్షన్నరకు సమీపంలో ఉండవచ్చని అంటున్నారు.