ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల అరాచకం మరోమారు తెరమీదకు వచ్చింది. ఈ దఫా వాళ్ల గురించి ప్రచారం ద్వారా తెలుసుకోవడం కాకుండా ఆ రాక్షస మూకనే తమ ఆకృత్యాలను ప్రపంచానికి తెలియజెప్పింది. రక్కా - మొసుల్ పట్టణాల్లో ఇటీవల సంకీర్ణ బలగాల చేతిలో గట్టి ఎదురుదెబ్బలు తగిలిన నేపథ్యంలో తమ సత్తాను చాటుకోవడానికి అన్నట్లుగా అరాచకాలతో కూడిన ఫొటోలను ఆన్ లైన్ లో పెట్టింది.
ఐసిస్ రాక్షసుల చేతిలో ఉన్న డమాస్కస్ లో తమ పరిపాలన ఏ విధంగా ఉందో చూడండి అంటూ కొన్ని ఫొటోలను విడుదల చేసింది. ఇందులో కిరాతకమైన శిక్షల తాలుకు ఘటనలు చూస్తుంటే ఒళ్లు గగుర్పాటు కలిగిస్తోంది. స్వలింగ సంపర్కానికి పాల్పడినందుకు ఓ వ్యక్తిని బిల్డింగ్ మీద నుంచి తోసివేసిన ఫోటోను ఐసిస్ విడుదల చేసింది. అంతేకాకుండా ఓ ముసుగువేసిన ఖైదీని మోకాళ్లపై కూర్చోబెట్టి కిరాతకంగా కాల్చి చంపుతున్న ఫోటో కూడా సోషల్ మీడియాలో పెట్టి తద్వారా తాము అమలు చేస్తున్న క్రూరమైన శిక్షలు ఎలా ఉంటుందో ఐసిస్ తెలియజెప్పింది.
కాగా కేవలం శిక్షలతోనే తమ రాక్షసత్వాన్ని ఐసిస్ ఆపేయడం లేదు. తమ పరిధిలో ఉండే వారు ఏ విధంగా నివసించాలో కూడా ఐసిస్ రాక్షసులు సెలవిస్తున్నారు. ఈ క్రమంలోనే టీషర్ట్ లపై ఉన్న బ్రాండ్ లోగోలను తొలగిస్తూ, ప్యాంటు పొడవు కొలతలు చూస్తూ వాటిని తొలగించండి అన్నట్లుగా ఉన్న హెచ్చరికల ఫొటోలను కూడా ఈ రాక్షస మూక విడుదల చేసింది. దీంతో ఐసిస్ ఆకృత్యాలకు అంతే లేదు అన్న చర్చ మరోమారు సాగుతోంది.