ఎమ్మెల్యేల అవినీతికి జగన్ మరో అడ్డుకట్ట!

Update: 2019-10-23 14:30 GMT
రాజకీయ పరమైన అవినీతిని పూర్తిగా నిర్మూలించడానికి కంకణం కట్టుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ విషయంలో మొదట్లో పార్టీ నుంచి నెగిటివ్ రియాక్షన్ వచ్చినా జగన్ మాత్రం తగ్గడం లేదు. విచ్చలవిడి అవినీతికి పూర్తిగా చెక్ చెప్పడానికే ఆయన ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి.

ఇలాంటి నేపథ్యంలో చాలా వరకూ ఇప్పటికే అవినీతికి అడ్డుకట్టలు వేసుకుంటూ వస్తున్నారు. ఒకరిద్దరు నేతలు ముడుపులు తీసుకున్నారనే సమాచారం అందుకున్న జగన్ మోహన్ రెడ్డి వాటిని వారి చేతే వెనక్కు ఇప్పించేశారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ప్రకటించారు. కరప్షన్ ఫ్రీ గవర్నమెంటే లక్ష్యంగా సాగుతున్నారు జగన్ మోహన్ రెడ్డి.

అలాగే  ఎమ్మెల్యేల అవినీతికి ఆస్కారం ఉండే అంశాలను ముందుగానే గుర్తించి జగన్ వాటిని బంద్ చేస్తూ ఉన్నారని సమాచారం. ఉద్యోగాల నియామాకానికి సంబంధించి ఎమ్మెల్యేలు  బాగా అవినీతి చేస్తారనే పేరుంది. అలాంటి వాటిల్లో ఒకటి ఐటీఐ అర్హతతో నియమించే ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలు. సబ్ స్టేషన్లలో సాగే ఈ కాంట్రాక్ట్ నియామకాలను ఎమ్మెల్యేలను ప్రతి సారీ అమ్ముకుంటూ ఉంటారు.

ఇది చాన్నాళ్ల నుంచి జరుగుతున్న తంతే. అయితే ఇప్పుడు జగన్ వాటికి పూర్తిగా చెక్ చెబుతున్నారు. ఒక్కో పోస్టును ఎమ్మెల్యేలు ఐదు నుంచి ఏడు లక్షలకు కొందరు. కొన్ని సందర్భాల్లో తొమ్మిదీ- పది లక్షల రూపాయలకు కూడా అమ్ముకుంటారు ఎమ్మెల్యేలు.  త్వరలోనే అందుకు సంబంధించి నియామకాలు జరగాల్సి ఉంది. ఇలాంటి నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి జాగ్రత్త వహిస్తున్నారని సమాచారం.

ఆ పోస్టులను అమ్ముకునే అవకాశాలు లేకుండా పూర్తిగా ఔట్ సోర్సింగ్ సేవల  ద్వారా నియామకాలు జరపాలని భావిస్తున్నారట. అప్పుడు రాజకీయ పరమైన అవినీతికి చెక్ చెప్పవచ్చనేది జగన్ ఆలోచనగా తెలుస్తోంది.

  


Tags:    

Similar News