ఎప్పుడు ఏం మాట్లాడతారో? ఎవరి మీద ఫైర్ అవుతారో అస్సలు అర్థంకాని నేతలు కొందరు ఉంటారు. అలాంటి కోవకే చెందుతారు ఏపీ అధికారపక్ష ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. సొంత ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే.. పోరాడేతత్వం లేకున్నా.. మాటలతో బండి లాగించే ధోరణి ఆయన సొంతం. కాస్త నోరు జారినట్లు ఆయన మాటలు కనిపించినా.. అందులో ఎంతోకొంత సెన్సెబులిటీ కనిపిస్తుంది. అధినేత మీద సైతం విమర్శలు చేసే ధైర్యమున్న జేసీ.. ప్రజలకు మేలు జరిగే అంశాల మీద.. చూసుకుందాం రా.. అంటూ ఢీ అంటే ఢీ అన్నట్లుగా మాత్రం వ్యవహరించరు.
అదే జేసీని.. ఆయన వ్యాపారాల మీద కానీ.. ఆయన ఆదాయ వనరుల మీద కానీ ఎవరైనా పల్లెత్తు మాట అన్నా సరే. వారి తాట తీసే వరకూ వదిలిపెట్టరు. అదే టైంలో ఏపీకి ప్రత్యేక హోదా లాంటివి మోడీ నుంచి ఎలా తెచ్చుకోవటం అంటే.. సాధ్యం కాదనేస్తారే తప్పించి.. సాధ్యమయ్యే ముచ్చట లేదంటే లేదని చెప్పేస్తారు. అలాంటి జేసీ.. తనకేమాత్రం సంబంధం లేని సబ్జెక్ట్ మీద మాట్లాడేశారు. అయితే.. జేసీ మాటలు నేషనల్ మీడియా వరకూ వెళ్లవు కాబట్టి సరిపోయింది కానీ.. లేకుంటే పార్టీ అధినేత చంద్రబాబుకు చుక్కలు కనిపించేవి.
దాయాది పాక్ మీద భారత సైన్యం జరిపిన సర్జికల్ దాడుల విషయంలో తమ మిత్రపక్షమైన బీజేపీ మీదా.. ప్రధాని మోడీ మీదా జేసీ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. భారత సైన్యం జరిపిన సర్జికల్ దాడులకు సంబంధించిన వీడియోల్ని బయటకు చూపించాలంటూ కొందరు చేస్తున్న వాదనల్ని బలపరిచేలా జేసీ మాట్లాడటం గమనార్హం. సర్జికల్ దాడులకు సంబంధించిన వీడియోలను మాజీ ప్రధానమంత్రులు.. మాజీ రక్షణ మంత్రులకైనా చూపించాలని జేసీ కోరుతున్నారు. ఎందుకలా అంటే.. ఆయన మోడీ మీద విమర్శలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రహస్యంగా ఉంచాల్సిన వీడియోలు కాబట్టి బయటకు చూపించకపోవచ్చన్న జేసీ.. బీజేపీ నేతల మాటల్ని పూర్తిగా నమ్మలేమన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మాట ఇచ్చి తప్పిన కమలనాథుల మాటలు.. నిజాలుగా చెప్పలేమన్నారు. అందుకే.. ప్రధాని మోడీ తన విశ్వసనీయతను ప్రదర్శించేందుకు వీలుగా మాజీ ప్రధానులు.. మాజీ రక్షణ మంత్రులకు సర్జికల్ వీడియోలు చూపించాలన్నారు. మోడీకి మిత్రపక్షంగా ఉంటే.. విపక్షాలు చేసే విమర్శలకు కౌంటర్ ఎటాక్ లు చేయాల్సింది పోయి.. మిత్రులపైనే మండిపడుతున్న జేసీ మాటలు ముఖ్యమంత్రి చంద్రబాబు చెవిన పడ్డాయా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/