మోడీకి షాక్ ఇచ్చే చాన్స్ వ‌దులుకుంటున్న కేసీఆర్‌?

Update: 2021-06-03 03:43 GMT
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని టార్గెట్ చేయ‌డంలో తానే ముందుంటాన‌ని, ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో కేంద్రంలో త‌న స‌త్తా చూపిస్తాన‌ని గ‌తంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప‌లు సంద‌ర్భాల్లో ఈ మేర‌కు సంచ‌ల‌న విమ‌ర్శ‌లు , ప్ర‌క‌ట‌న‌లు చేశారు. అయితే, ప్ర‌ధానిని టార్గెట్ చేసేందుకు ద‌క్కిన ఓ గొప్ప అవ‌కాశాన్ని కేసీఆర్ కావాల‌నే వ‌దులుకుంటున్నారా లేక‌పోతే త‌న దృష్టికి రాలేదా అనే విష‌యం హాట్ టాపిక్ గా మారింది.

దేశంలో కొవిడ్-19 వ్యాక్సీన్లకు తీవ్ర కొరత ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఉద్దేశించి కేర‌ళ సీఎం విజ‌య‌న్ లేఖ రాశారు. కేంద్ర‌మే టీకాల బాధ్య‌త తీసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. తాజాగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఇవాళ ఓ లేఖ రాశారు. వ్యాక్సీన్ కొనుగోలులో రాష్ట్రాలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నందున కేంద్ర ప్రభుత్వమే వీటిని కొనుగోలు చేసేలా అందరూ ఏకాభిప్రాయానికి రావాలంటూ అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు రాసిన లేఖ‌లో ఆయ‌న ప్ర‌తిపాదించారు. భవిష్యత్తులో తలెత్తే వైరస్ వేవ్‌ల నుంచి ప్రజలను కాపాడుకోవాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని సీఎం పట్నాయక్ పేర్కొన్నారు.

అయితే, ఇలాంటి త‌రుణంలో ఢిల్లీకి త‌న స‌త్తా చాటుతాన‌ని, ఇంకా చెప్పాలంటే మోడీకి ప్ర‌త్యామ్నాయ వేదిక‌ను ఏర్పాటు చేస్తాన‌ని గ‌తంలో ప్ర‌క‌టించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు దేశ‌మంతా ఎదుర్కుంటున్న స‌మ‌స్య విష‌యంలో ఎందుకు మౌనంగా ఉన్నార‌నేది అంతు చిక్క‌ని అంశంగా మారింద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వమే వ్యాక్సీన్లు కొనుగోలు చేసి రాష్ట్రాలకు అందించడమే ఉత్తమ మార్గమని... ఇత‌ర రాష్ట్రాల సీఎంల వ‌లే ఎందుకు కేసీఆర్ లేఖ రాయ‌లేక‌పోతున్నారంటూ అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.
Tags:    

Similar News