అవేశ‌ప‌డిన‌ అక్బ‌రుద్దీన్‌ కు కేసీఆర్ కూల్ ఆన్స‌ర్‌

Update: 2017-03-17 08:10 GMT
తెలంగాణ రాష్ట్ర బ‌డ్జెట్ స‌మావేశాలు సాగుతున్నాయి. సాఫీగా సాగిపోతున్న స‌మావేశాల్లో.. వివిధ అంశాల‌పై స‌భ్యులు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. త‌న ప్ర‌సంగంలో భాగంగా మ‌జ్లిస్ పార్టీకి చెందిన అక్బ‌రుద్దీన్ ఓవైసీ మాట్లాడున్న స‌మ‌యంలో ఆస‌క్తిక‌ర అంశం ఒక‌టి చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల‌కు సంబంధించిన తెలుగు మీడియాకు చెందిన ఒక మీడియా సంస్థ‌లో కొత్త జిల్లాల‌ను కేంద్ర హోం శాఖ ఇప్ప‌టివ‌ర‌కూ ఆమోదం తెల‌ప‌లేద‌ని పేర్కొంద‌ని.. దానిపై వివ‌ర‌ణ ఇవ్వాల‌న్నారు.

ఈ సంద‌ర్భంగా ఎప్ప‌టిలానే త‌న‌దైన శైలిలో ఆవేశంతో మాట్లాడేశారు. దీనికి వెంట‌నే స్పందించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. చాలా కూల్ గా రియాక్ట్ కావ‌ట‌మే కాదు.. చాలా సింఫుల్ గా సూటిగా.. స్ప‌ష్టంగా త‌న స‌మాధానాన్ని చెప్పేశారు. కొన్ని మీడియా సంస్థ‌లు అప్పుడ‌ప్పుడు అత్యుత్సాహాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంటాయ‌ని.. అలాంటి వాటిని ప‌ట్టించుకోకూడ‌ద‌న్న కేసీఆర్‌.. కొత్త జిల్లాల ఏర్పాటు విష‌యంలో అధికారం మొత్తం రాష్ట్రానికే ఉంటుంద‌ని.. కేంద్రానికి ఎలాంటి సంబంధం ఉండ‌ద‌న్నారు.

మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాన్ని ప‌ట్టించుకోవ‌ద్ద‌ని కేసీఆర్ సూచించారు. ఇక్క‌డ పాయింట్ ఏమిటంటే..అక్బరుద్దీన్ చిన్న చితాకా లీడ‌ర్ కాదు. జూనియ‌ర్ రాజ‌కీయ నేత అంత‌క‌న్నా కాదు. చాలానే సీనియ‌ర్‌. ఇక‌.. జాతీయ స్థాయిలో ఆ పార్టీ ఇర‌గ‌దీయాల‌ని ఫీల‌వుతుంటుంది. మ‌రి.. అలాంటి పార్టీకి చెందిన కీల‌క నేత అయిన అక్బ‌రుద్దీన్‌ కు కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేసే అధికారం కేవ‌లం రాష్ట్రాల‌కు ఉంటుంద‌ని.. ఇందులో కేంద్రం జోక్యం ఏమాత్రం ఉండ‌ద‌న్న విష‌యం తెలియ‌క‌పోవ‌టం ఏమిటి..? ద‌డ ద‌డా అంటూ ఇంగ్లిషులో మాట్లాడేసే అక్బ‌రుద్దీన్‌.. కాస్తాకూస్తో గూగులమ్మ‌నో.. త‌మ‌కు స‌న్నిహితంగా ఉండే అధికారుల్ని స‌మాచారం అడిగినా స‌రిపోయేది క‌దా. ఇవేమీ కాద‌నుకుంటే.. స‌మాచార‌హ‌క్కు చ‌ట్టం ఉండ‌నే ఉంది క‌దా..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News