రష్యాపై ఆంక్షల కొరఢా.. ఎగుమతులపై నిషేధం.. పుతిన్ పై ట్రావెల్ బ్యాన్

Update: 2022-02-28 13:30 GMT
ఉక్రెయిన్ పై రష్యా జరుపుతున్న సైనిక చర్యకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఆంక్షల కొరఢాను తీవాయి. అగ్రరాజ్యం అమెరికా నుంచి బ్రిటన్ యూరప్ దేశాలు, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, దక్షిణ కొరియాలు ఆంక్షలు విధించాయి.

ఇప్పటికే సిఫ్ట్ దెబ్బతో ఉక్కిరిబిక్కిరి అయిన రష్యాకు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. రష్యాకు అమెరికాతోపాటు కెనడా దేశాలు గట్టి షాక్ ఇచ్చాయి.

రష్యాలో తయారైన మద్యం, లిక్కర్ ను బ్యాన్ చేస్తున్నట్టు అమెరికా, కెనడా ప్రకటించాయి. ఈ దెబ్బతో రష్యాలో తయారైన మద్యం విక్రయాలకు ఆ రెండు దేశాల్లో బ్రేక్ పడింది. అమెరికాలో రష్యా బ్రాండ్ లిక్కర్ భారీ మొత్తంలో విక్రయిస్తున్నారు. ఇప్పుడు ఆ దేశానికి భారీ నష్టం వచ్చే అవకాశం ఏర్పడింది.

రష్యా అధ్యక్షుడు పుతిన్, ఆయన సెక్యూరిటీ కౌన్సిల్ లోని సభ్యులపై తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం ట్రావెల్ బ్యాన్ విధించింది. మరోవైపు స్విఫ్ట్ నుంచి కొన్ని రష్యా బ్యాంకులను  బ్యాన్ చేసిన సౌత్ కొరియా.. తాజాగా ఆ దేశ వ్యూహాత్మక ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది. రష్యాకు వత్తాసు పలుకుతున్న బెలారస్ పై కూడా జపాన్ ఆంక్షలు విధించింది.  

ఇక తమపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆర్థిక ఆంక్షలను అధిగమించగలమని రష్యా ధీమా వ్యక్తం చేసింది. ఆ ఆంక్షలు కఠినమైనవే.. కానీ ఈ నష్టాన్ని భర్తీ చేయగల సామర్థ్యం మా వద్ద ఉంది అని ఆ దేశ ప్రతినిధి దిమిత్రి తెలిపారు.

ఇక బెలారస్ వేదికగా ఉక్రెయిన్-రష్యా ప్రతినిధుల మధ్య కీలక చర్చలు ప్రారంభమయ్యాయి. తక్షణమే కాల్పుల విరమణకు ఉక్రెయిన్ పట్టుబడుతుండగా... పలు ఒప్పందాలకు అంగీకారం తెలుపాలని రష్యా కోరుతోంది.
Tags:    

Similar News